బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమాల ద్వారా ఎంతోమంది మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందినటువంటి వారిలో యూట్యూబర్ టేస్టీ తేజ( Tasty Teja ) ఒకరు.
ఈయన యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఎన్నో రకాల రెస్టారెంట్లకు వెళుతూ అక్కడ ఫుడ్ టెస్ట్ చేస్తూ వీడియోలు చేసేవారు.దీంతో ఈయనకు సోషల్ మీడియాలో కూడా మంచి పాపులారిటీ వచ్చింది.
ఈ పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ అవకాశం కూడా కల్పించారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి టేస్టీ తేజ తాను హౌస్ లో ఉన్నన్ని రోజులు అభిమానులను పెద్ద ఎత్తున ఎంటర్టైన్ చేశారు.ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈయన తన కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు.ఈయన క్రేజ్ చూసి హీరోలు సైతం ఈయనతో కలిసి వీడియోలు చేస్తూ తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేవారు.
ఇలా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి టేస్టీ తేజ సరికొత్త వ్యాపార రంగంలోకి అడుగు పెడుతున్నారు.
నేడు ఈయన హైదరాబాద్లో ఇరానీ నవాబ్స్( Iranian Nawabs ) పేరుతో టేస్టీ తేజ హోటల్ ప్రారంభించబోతున్నారు.ఈ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ దీప్ ( Amar Deep ) ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారని తెలుస్తుంది.తన కొత్త బిజినెస్ గురించి టేస్టీ తేజ మాట్లాడుతూ నేను కొత్తగా ఒక ప్రయాణం మొదలుపెడుతున్నానని ఈ ప్రయాణంలో నాతో పాటు మీరు మనందరం కలిసి ఎదుగుదామని తెలిపారు.
సాధిద్దాం సంపాదిద్దాం అంటూ ఈయన షేర్ చేసినటువంటి ఈ వీడియో వైరల్ గా మారింది.ఇలా తేజ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నారని తెలిసి ఈయన అభిమానులు మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు.