బిగ్ బాస్( BIGGBOSS ) లోకి ఇప్పటికే ఎంతోమంది కనుమరుగైన నటీనటులు వచ్చి ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.ఒకప్పుడు ఎంతో స్టార్ హోదాలో కొనసాగిన వాళ్ళు కొత్త వాళ్ళు వస్తున్న కొద్దీ వారికి అవకాశాలు రాకపోవడంతో కనుమరుగై పోయారు.
కానీ బిగ్ బాస్ రియాల్టీ షో తమకు మళ్ళీ మంచి కెరీయర్ ని ఇస్తుంది అనే ఆశతో ఎంతోమంది ఈ షోలోకి వచ్చారు.అయితే తాజాగా బిగ్ బాస్ 7 లోకి ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగిన శివాజీ ఎంట్రీ ఇచ్చారు.
చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న శివాజీ( Shivaji ) బిగ్ బాస్ ద్వారా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు.ఇక ఎప్పుడైతే శివాజీ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారో అప్పటినుండి ఆయన గురించి ఎన్నో తెలియని విషయాలు, ఆయన సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు, సినిమాల్లో ఎలా అవకాశాలు వచ్చాయి.
ఆయనకు సంబంధించిన కొన్ని రాజకీయ విషయాలు అలాగే ఎఫైర్స్ విషయాలు అన్నీ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.అయితే తాజాగా అలాంటి వార్తే ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఇక అందులో ఏముందంటే..శివాజీ లయ ( Shivaji-Laya ) మధ్య బ్రేకప్ జరగడానికి ఆ హీరోయినే కారణమా అంటూ ఒక వార్త వినిపిస్తోంది.ఇక అసలు విషయంలోకి వెళ్తే.
శివాజీ లయ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి.అందులో అదిరిందయ్యా చంద్రం, లయోలా కాలేజ్, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, టాటా బిర్లా మధ్యలో లైలా ( Tata birla madhyalo laila ) వంటి సినిమాలు వచ్చాయి.

మొదటి సినిమా లయోలా కాలేజ్ (Layola college) షూటింగ్ టైంలో వీరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడి అది కాస్త మరిన్ని సినిమాల్లో నటించే టైంలో ప్రేమగా మారిందట.అయితే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని ఇండస్ట్రీలో ఒక న్యూస్ గుప్పుమంది.కానీ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు ఈ ఇద్దరు.అయితే ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్న సమయంలో మిస్సమ్మ సినిమాలో శివాజీ చేసే టైంలో మీరాజాస్మిన్ ( Meera Jasmin ) కి శివాజీకి మధ్య ఫ్రెండ్షిప్ బలపడింది.
దాంతో కొత్తనీరు వస్తున్న కొద్ది పాతనీరు పోతుంది అన్నట్లుగా లయని వదిలేసి మీరాజాస్మిన్ వెంటపడ్డారు శివాజీ.అలా మీరజాస్మిన్ తో శివాజీ వరుస సినిమాల్లో చేశారు.కానీ ఈ విషయం తెలుసుకున్న లయ (Laya) ఎంతో బాధపడి సినిమాలకి కూడా పుల్ స్టాప్ పెట్టి 2006లో ఎన్నారై డాక్టర్ ని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.అయితే మీరాజాస్మిన్ తో రిలేషన్ కొనసాగిస్తున్న టైంలోనే మీరాజాస్మిన్ కి తల్లిదండ్రులతో ఉన్న విభేదాలు అలాగే మాజీ బాయ్ ఫ్రెండ్స్ తో ఉన్న గొడవలు మీడియాలో వినిపించేసరికి తనతో లవ్ అంతగా సెట్ అవ్వదని ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేశాడు శివాజీ.
ఇలా శివాజీ లయ ( Sivaji-Laya) మధ్య బ్రేకప్ జరగడానికి మీరాజాస్మినే కారణం అంటూ అప్పట్లో ఓ వార్త వినిపించింది.







