మరో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ శివాజీ... ఆ కంటెస్టెంట్లకు  చుక్కలే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో శివాజీ( Shivaji ) ఒకరు.ఈయన హీరోగా మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో కూడా నటించే ప్రేక్షకులను మెప్పించారు.

 Bigg Boss Shivaji Chance To Host Bigg Boss Buzz Details, Bigg Boss, Shivaji, Hos-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఈయన రాజకీయాల వైపు కూడా వెళ్లారు.అయితే రాజకీయాలలో కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేదని చెప్పాలి.

ఈ క్రమంలోనే ఇటు సినిమాలకు రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి ఈయన ఒకసారి ఇక బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమంలో కనిపించారు.

Telugu Bigg Boss, Bigg Boss Buzzz, Biggboss, Buzz, Sivaji, Nagarjuna, Shivaji-Mo

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి శివాజీ విజేతగా నిలుస్తారని అందరూ భావించినప్పటికీ ఈయన మాత్రం టాప్ త్రీ కంటెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు.ఇక బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరోసారి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయన ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెట్టారు.

Telugu Bigg Boss, Bigg Boss Buzzz, Biggboss, Buzz, Sivaji, Nagarjuna, Shivaji-Mo

ఇకపోతే త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8( Bigg Boss 8 ) ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే .ఈ క్రమంలోనే తరచూ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాజాగా శివాజీకి సంబంధించి మరొక వార్త వైరల్ అవుతుంది.బిగ్ బాస్ కార్యక్రమం ప్రసారమయ్యే సమయంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు అందరూ కూడా బిగ్ బాస్ బజ్( Bigg Boss Buzz ) కార్యక్రమానికి కూడా హాజరవుతారు.

  అయితే అక్కడ గత సీజన్ లో పాటిస్పేట్ చేసిన కంటెస్టెంట్ హోస్ట్ గా ఉంటారు.ఈ క్రమంలోనే సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొని ఎలిమినేట్ అయిన వారిని శివాజీ బజ్ హోస్ట్ గా వ్యవహరిస్తూ ప్రశ్నించబోతున్నారని తెలుస్తోంది.

ఇక శివాజీ వ్యవహార శైలి గురించి అందరికీ తెలిసిందే.ప్రతి విషయాన్ని ఈయన ప్రశ్నిస్తూ ఉంటారు మరి ఎలిమినేట్ అయ్యి వచ్చిన వారికి ఈయన తన ప్రశ్నలతో చుక్కలు చూపిస్తారని పలువురు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube