ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు.. బిగ్ బాస్ కంటస్టెంట్ షాకింగ్ కామెంట్స్?

తెలుగు బిగ్ బాస్ షో నే కాదు.హిందీలో ప్రసారం అవుతున్న ప్రోగ్రామ్ కి కూడా చాలా క్రేజ్ ఉంది.

దాదాపు 107 రోజులు ఒకే ఇంట్లో ఉన్నాకా.వారి మధ్య గొడవలు, మళ్ళీ కలిసిపోవడాలూ సహజం.

అలా ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడటం అనుబంధాన్ని పెంచుకోవడం జరుగుతాయి.అలాంటి సందర్భాల్లో ఎలా నామినేట్ చేస్తారు అనే కాన్సెప్ట్ అత్యంత ఇంట్రెస్ట్ గా ఉంటుంది.

ఇక పోతే.హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ ముగింపుకు చేరుకుంటోంది.

Advertisement

ఇటీవలే హౌస్‌ నుంచి సింగర్‌ నేహా భాసిన్‌ ఎలిమినేట్‌ అయ్యారు.తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.

బిగ్‌బాస్‌ షోలోని సహ సభ్యులతో ఉన్న అనుబంధాన్ని వివరించారు.దాంతో పాటు టాప్‌ 5లో చోటు దక్కనందుకు బాధపడ్డారు.

నేను టాప్‌ 5లో లేకపోవడం నన్ను షాక్‌కు గురి చేసింది.ఎందుకంటే ఎలిమినేట్‌ అవుతానన్న ఆలోచనే నాకు లేదు.

నాకు ఈ బిగ్‌బాస్‌ ట్రోఫీ చాలా ముఖ్యం.అలాగే నా ఫ్రెండ్స్‌తో ఇంకా ఎక్కువ రోజులు ఉండాలనుకున్నా, కానీ ఇలా జరిగింది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ప్రేక్షకులు నా జర్నీ ఇక్కడివరకు మాత్రమే అని నిర్దేశించారు.వాళ్ల నిర్ణయాన్ని సాదరంగా స్వాగతిస్తున్నాను.

Advertisement

ఇన్నిరోజుల బిగ్‌బాస్‌ ప్రయాణానికి నా భర్త ఎంతగానో సపోర్ట్‌ ఇచ్చారు.కేవలం నా కోసమే ఈ షో చూసేవారు.

అదే సమయంలో ఇంట్లో జరుగుతున్న గొడవలు చూసి మా అమ్మ భయపడిపోయింది.కొన్నిసార్లు నా తల్లి, సోదరుడు, భర్తను సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేశారు.

అది వాళ్లను ఎంతగానో కుంగదీసింది.కానీ ఇలా కావాలని టార్గెట్‌ చేయడం కరెక్ట్‌ కానే కాదు అంటూ నేహా వాపోయారు.

ఇక ఈ సీజన్‌లో ప్రతీక్‌ గెలిస్తే బాగుంటుందనుకుంటున్నాను.లేదంటే ఆ తర్వాత షమిత శెట్టి విజేతగా నిలవాలని ఆశిస్తున్నట్టు ఆమె తెలిపారు.హౌస్‌లో దివ్య అగర్వాల్‌తో విపరీతమైన గొడవలు జరిగాయి.

నన్ను ఎన్నోసార్లు దెబ్బతీయాలని చూసింది.దీనివల్ల చాలా ఇబ్బందులు పడ్డాను.

నా కెరీర్‌ మొదట్లోనూ దివ్య లాంటి ఎంతో మంది నా మైండ్‌తో గేమ్స్‌ ఆడారు, నన్ను డిప్రెషన్‌లోకి నెట్టేశారు, ఆత్మహత్యకు ప్రేరేపించారు.ఇలా అంటున్నందుకు దివ్య కుటుంబాన్ని నేను క్షమాపణలు కోరుతున్నాను.కానీ ఆమె చేస్తోంది అదే.నన్ను మాత్రమే కాదు, హౌస్‌లో చాలామందితో ఆమె ఆడుకుంటోంది అని నేహా భాసిన్‌ చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు