బాలయ్య, మహేష్ పరిచయాలను వాడుకోలేదు.. మానస్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ షో సీజన్5 ద్వారా పాపులర్ అయిన కంటెస్టెంట్లలో మానస్ ఒకరనే సంగతి తెలిసిందే.ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మానస్ మాట్లాడుతూ మారుతి గారి ఫస్ట్ సినిమా ఈరోజుల్లో సినిమాలో నటించే ఛాన్స్ నాకు వచ్చిందని ఆ సినిమా చేసి ఉంటే నా కెరీర్ మరో రేంజ్ లో ఉండేదని అభిప్రాయపడ్డారు.

 Bigg Boss Maanas Comments About Balakrishna Adn Mahesh Babu Goes Viral , Balakr-TeluguStop.com

ఈరోజుల్లో 5డీలో తెరకెక్కిన సినిమా అని మానస్ కామెంట్లు చేశారు.

అప్పుడు నేను బీటెక్ చదువుతున్నానని 5డీలో చేస్తామని చెప్పడంతో వద్దని చెప్పానని మానస్ వెల్లడించారు.

ఈరోజుల్లో సినిమాను బన్నీ ప్రమోట్ చేశారని మానస్ అన్నారు.మంచి సినిమా మిస్ అయ్యానని అనిపించిందని ఆయన పేర్కొన్నారు.

మారుతి బ్యానర్ లో తెరకెక్కిన రెండు సినిమాలలో నేను చేశానని ఆయన కామెంట్లు చేశారు.ఓపిక ఉండి మంచి బిహేవియర్ ఉంటే ఇండస్ట్రీలో ఆలస్యంగా అయినా సక్సెస్ అవుతామని మానస్ పేర్కొన్నారు.

ఒక రొమాంటిక్ క్రైమ్ కథ సినిమాలో కూడా నాకు ఛాన్స్ వచ్చిందని ఆ సినిమాను కూడా 5డీలో చేస్తామని చెప్పడంతో నో చెప్పానని మానస్ అన్నారు.గుణశేఖర్ గారి డైరెక్షన్ లో తెరకెక్కిన అర్జున్ సినిమాలో తాను యాక్ట్ చేశానని మానస్ అన్నారు.

బాలయ్య, మహేష్ సినిమాలలో నేను చేసినా బిగ్ బాస్ షోలో ఉన్న సమయంలో కూడా ప్రమోషన్స్ విషయంలో హెల్ప్ చేయమని అడగలేదని మానస్ కామెంట్లు చేశారు.

Telugu Balakrishna, Bigg Boss, Maanas, Mahesh Babu-Movie

బాలయ్య, మహేష్ లతో పరిచయాలను వాడుకోలేదని మానస్ తెలిపారు.ఆఫీస్ నుంచి పిలుపు వస్తే వెళ్లడం తప్ప పర్సనల్ గా కలవడం చాలా తక్కువ అని మానస్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం సినిమాలకు ప్రమోషన్స్ కూడా చాలా ముఖ్యమని మానస్ వెల్లడించారు.

సరైన ప్రమోషన్స్ లేకపోవడం వల్లే నేను నటించిన కొన్ని సినిమాలు ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేదని మానస్ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube