బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన కీర్తి భట్( keerthi bhat ) సోషల్ మీడియా వేదికగా ఏం కామెంట్ చేసినా ఆ కామెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.శివరాత్రి పండుగ రోజున కీర్తి భట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్త్రీలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.కీర్తి భట్ ఒక సెల్ఫీ వీడియోను షేర్ చేస్తూ ఈ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.
మనం ప్రతిరోజూ దేవుడిని వేడుకుంటామని శివరాత్రి( Shivratri ) అనే కాదు ఎప్పుడూ దేవుడికి పుజలు చేస్తుంటామని కీర్తి భట్ వెల్లడించారు.అందరూ బాగుండాలనే పూజలు చేస్తామని ఆమె అన్నారు.
దేశంలో మహిళలపై అరాచకాలు, అఘాయిత్యాలు జరుగుతుంటే ఆ దేవుడు ఏం చేస్తున్నాడని కీర్తి భట్ ప్రశ్నించారు.మాట్లాడదామా వద్దా అని అనుకుంటూనే ఫోన్ చూస్తున్నానని ఆమె తెలిపారు.
దేవుడి కోసం అది ఇది అన్నీ చేస్తామని నైవేద్యాలు పెడతాం పూజలు చేస్తున్నామని కీర్తి భట్ వెల్లడించారు.ఈరోజే కాదు ఇంకోరోజైనా దేవుడికి పూజలు చేస్తామని ఆమె తెలిపారు.ఒక చిన్నారిపై అఘాయిత్యం జరిగిందని అది కూడా దేవుడు చేస్తూ ఊరుకున్నాడని ఆమె వెల్లడించారు.ఏం చేయకుండా దేవుడు చూస్తూ కూర్చుకున్నాడని అమె పేర్కొన్నారు.అలాంటి టైమ్ లో కాపాడలేని దేవుడు ఎందుకని కీర్తి భట్ ప్రశ్నించారు.
పసిపిల్లలంటే దేవుడితో సమానం అని అంటారని పసిపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే దేవుడు దేవుడు ఏం చేస్తున్నాడని ఆమె అన్నారు.ఇవన్నీ చూస్తుంటే అసలు దేవుడే లేడనిపించిందని ఆమె వెల్లడించారు.కీర్తి భట్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కీర్తి భట్ కామెంట్లను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.కీర్తి భట్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని వివాదాలకు దూరంగా ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.