Ashu Reddy Venu Swamy : మరోసారి వేణు స్వామి చేత పూజలు చేయించిన బిగ్ బాస్ బ్యూటీ.. ఎవరి నమ్మకం వాళ్లదంటూ?

ఇటీవల కాలంలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నటువంటి వారిలో ప్రముఖ ఆస్ట్రాలర్ వేణు స్వామి( Venu Swamy ) కూడా ఒకరు ఈయన అందరి జాతకాలను చూపుతూ ఉండేవారు అయితే సమంత నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నారు అనే విషయం తెలియడంతో వారి జాతకాలను చెబుతూ వారిద్దరు విడిపోతారని పెళ్లైన మూడు సంవత్సరాలకు వీరు విడాకులు తీసుకోబోతున్నారు అంటే వేణు స్వామి చేసిన కామెంట్లో అప్పట్లో వైరల్ అవ్వడంతో సమంత నాగచైతన్య అభిమానులు ఈయనపై భారీ స్థాయిలో విమర్శలు చేశారు.

 Bigg Boss Fame Ashu Reddy Shares Devotional Pooja Video With Venu Swamy-TeluguStop.com

ఇక వేణు స్వామి చెప్పిన విధంగానే సమంత నాగచైతన్య విడిపోవడంతో ఈయన మాటలు నిజమేనని ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

అప్పటి నుంచి వేణు స్వామి తరచూ సినిమా సెలబ్రిటీల జాతకాలను చెబుతూ వార్తలో నిలుస్తున్నారు.రాజకీయ నాయకుల గురించి రాజకీయ నాయకుల భవిష్యత్తు గురించి ఈయన చేసే వ్యాఖ్యలు ఇటీవల నిజం కాకపోవడంతో చాలా విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా ఎంతమంది సెలబ్రిటీలు ఈయన చేత జాతకం చెప్పించుకోవడమే కాకుండా జాతకంలో ఏవైనా దోష పరహారాలు ఉన్నప్పటికీ కూడా తన చేత పూజలు చేయించుకుంటూ ఉంటారు.అంతే కాకుండా మరికొందరు తమ కెరియర్ సక్సెస్ కోసం వేణు స్వామి చేత పూజలు చేయించుకున్నటువంటి సెలబ్రిటీలు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు.ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం ద్వారా ఎంతో పాపులర్ అయినటువంటి నటి అషురెడ్డి( Ashu Reddy ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అషురెడ్డి సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు.ఈమె రెండు సార్లు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి మంచి సక్సెస్ అయ్యారు.ఇకపోతే ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఈమె బిజీగా ఉన్నారు.

ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా వేణు స్వామి చేత తన ఇంట్లో ప్రత్యేకంగా పూజలు( Ashu Reddy Pooja ) చేయించినటువంటి ఫోటోలు వీడియోలను షేర్ చేశారు.ఇందులో భాగంగా వేణు స్వామి ఆశీర్వాదం తీసుకుంటూ ఆయనకు పాదాభివందనాలు చేశారు.

ఇక ఈ ఫోటోలు వీడియోలు వైరల్ గా మారడంతో ఈమె కెరియర్ సక్సెస్ అందుకోవడం కోసమే ఇలా పూజలు చేయించారని పలువురు భావిస్తున్నారు.

అయితే గతంలో కూడా ఈమె వేణు స్వామి చేత ప్రత్యేకంగా పూజలు చేయించారు.అదేవిధంగా ఇటీవల ఈమె కొత్త కారు కొనుగోలు చేసినప్పుడు కూడా అషురెడ్డి తన కొత్త కారుకు ఏకంగా వేణు స్వామి చేత ప్రత్యేకంగా పూజలు చేయించారు.ఈ విధంగా ఈమె తరచూ వేణు స్వామి చేత ఇలా పూజలు చేయించడంతో ఈమె సక్సెస్ కోసమే ఇలా పూజలు చేస్తున్నారని పలువురు కామెంట్లు చేయగా మరికొందరు ఎవరి నమ్మకాలు వారి అంటూ ఈ పోస్టులపై కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube