Team India : ఇంగ్లాండ్ తో మూడు టెస్టులు ఆడే భారత జట్టు ఇదే.. 3 మ్యాచ్లను కోహ్లీ దూరం..!

భారత్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ ( Virat Kohli )మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్లు పూర్తయిన సంగతి తెలిసిందే.తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధిస్తే.

 This Is The Indian Team That Will Play Three Tests Against England Kohli Missed-TeluguStop.com

రెండో మ్యాచ్లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఇక ఇంగ్లాండ్ తో జరిగే చివరి మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత కారణాల వల్ల ఈ మూడు టెస్టు మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు.

ఇక భారత జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్( Shreyas Iyer ) ఇప్పటివరకు జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లలో ఘోరంగా విఫలమయ్యాడు.దీంతో శ్రేయస్ అయ్యర్ పై వేటు పడింది.గాయాల కారణంగా జట్టుకు దూరమైన రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్( Ravindra Jadeja, KL Rahul ) తిరిగి ఫిట్నెస్ సాధించారు.

వీరిద్దరూ తిరిగి జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు.

అంతేకాదు ఒక యువ బౌలర్ కు జట్టులో చోటు దక్కింది.ఆకాష్ దీప్( Akash Deep ) కు అవకాశం దక్కింది.ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన అనాధికారిక టెస్టు సిరీస్ లో ఆకాష్ దీప్ సత్తా చాటాడు.

ఫిబ్రవరి 15వ తేదీ ఇంగ్లాండ్ తో మూడవ టెస్ట్ మ్యాచ్ ఆడే భారత జట్టు ఇదే.రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, రజత్ పటీదార్, సర్పరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్, జస్ప్రీత్ బూమ్రా (వైస్ కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube