బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి సీరియల్స్ లో నటిస్తూ ఎంతోమంది బుల్లితెర అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వారిలో నటి కీర్తి భట్( Keerthi Bhat ) ఒకరు.ఇలా బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమంలో సందడి చేశారు.
ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె త్వరలోనే ఓ ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్న విషయం మనకు తెలిసిందే.ఈమె నటుడు విజయ్ కార్తీక్ (Vijay Karthik ( తోట అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈమె ఆదివారం ఎంతో ఘనంగా నిశ్చితార్థ( Engagement ) వేడుకను జరుపుకున్నారు.ప్రస్తుతం ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కీర్తి తన నిశ్చితార్థ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలను ఆహ్వానించిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరై సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ కీర్తి కాలికి పట్టీలు తొడిగారు.అనంతరం నిశ్చితార్థపు ఉంగరం తొడగగా ఈమె కూడా తన చేతికి ఉంగరం తొడిగి దండలు మార్చుకున్నారు.
ఈ నిశ్చితార్థ వేడుకలలో భాగంగా వీరిద్దరూ ఆకుపచ్చ సంప్రదాయ దుస్తులలో సందడి చేశారు.ఇలా వీరిద్దరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది వీరిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ కోరుకుంటున్నారు.అయితే ఓ ప్రమాదంలో భాగంగా కీర్తి ఫ్యామిలీ మొత్తం చనిపోయిన సంగతి తెలిసిందే.ఇక కీర్తి కూడా భవిష్యత్తులో తల్లి కాలేదనే విషయం తెలుసుకున్నప్పటికీ ఆమెపై ప్రేమతో విజయ్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు.
ఇదే విషయాన్ని ఓ కార్యక్రమంలో తెలియజేస్తూ ఎమోషనల్ అయినా సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం నిశ్చితార్థం చేసుకున్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.