ఆ ఫీలింగ్స్ గురించి ఆడవాళ్లను మాట్లాడనివ్వరు.. బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్ వైరల్!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో( Bigg Boss Show ) భాషతో సంబంధం లేకుండా హిట్ అవుతూ ఈ షోను నిర్మించిన వాళ్లకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందిస్తోంది.రాగిణి ఎం.

 Bigg Boss Beauty Divya Agarwal Comments Goes Viral In Social Media Details Here-TeluguStop.com

ఎం.ఎస్ రిటర్న్స్2 తో తన కెరీర్ ను మొదలుపెట్టిన దివ్య అగర్వాల్ ( Divya Agarwal )బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్1 విజేతగా నిలిచారు.తాజాగా ఒక ఇంటర్య్వూలో పాల్గొన్న దివ్య అగర్వాల్ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.

నా ప్రయాణం అద్భుతంగా సాగిందని దివ్య అగర్వాల్ అన్నారు.

యుక్త వయస్సులో ఉన్న సమయంలో నేను అమాయకంగా ఉన్నానని ఆమె తెలిపారు.నా ఒరిజినాలిటీ నన్ను ముందుకు నడిపిస్తుందని దివ్య అగర్వాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

నేనప్పుడూ అలా మాట్లాడటానికి భయపడనని భార్యాభర్తల రిలేషన్ గురించి కూడా ఓపెన్ గా మాట్లాడతానని ఆమె చెప్పుకొచ్చారు.నాకు అర్థం చేసుకునే భర్త దొరికాడని దివ్య అన్నారు.

Telugu Bigg Boss Show, Divya Agarwal, Womens Sexual-Movie

మన సమాజంలో ఉన్న ఇబ్బంది ఏంటంటే మహిళలు లైంగిక కోరికలను( Women’s sexual desires ) బయటకు చెప్పడానికి ప్రోత్సహించరని దివ్య కామెంట్లు చేశారు.మన సమాజం ఇలాంటి విషయాలపై మాట్లాడదని ఆమె చెప్పుకొచ్చారు.ఈ అంశాలకు సంబంధించి చాలా సందేహాలు ఉంటాయని దివ్య అగర్వాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఒక స్త్రీ తనకు భర్తకు మధ్య ఏదో మిస్సైందని ఫీలైన సమయంలో తప్పనిసరిగా భార్య సాయం కోరుతుందని దివ్య అన్నారు.

Telugu Bigg Boss Show, Divya Agarwal, Womens Sexual-Movie

భార్యాభర్తల మధ్య అనుకూలత, సాన్నిహిత్యం మాత్రమే బంధానికి నిదర్శనం అని దివ్య అగర్వాల్ చెప్పుకొచ్చారు.మీరు మీ జీవితాంతం ఎవరితోనైనా ఉండాలని కోరుకుంటే ఇలాంటి సంభాషణలు చేయడం చాలా ముఖ్యమని దివ్య అగర్వాల్ అన్నారు.తను హోస్ట్ గా చేస్తున్న కిస్ ఇష్క్ ఎన్ కనెక్షన్స్ షోలో భాగస్వాములిద్దరూ తమ భావాలను ఎక్స్ ప్రెస్ చేయడం ముఖ్యమని దివ్య అగర్వాల్ కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube