నీకు బట్టలు సరిగ్గా వేసుకోవడం కూడా రాదు.. విష్ణుప్రియపై సోనియా కామెంట్స్ వైరల్!

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 8( Bigg Boss 8 ) కొట్లాటలు గొడవలతో సాగుతోంది.

ఇటీవలె మొదలైన ఈ బిగ్ బాస్ షో ఇప్పటికే మొదటి వారం పూర్తి చేసుకొని రెండవ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇప్పటికే మొదటి వారం ఎలిమినేషన్ కూడా పూర్తి అయిన విషయం తెలిసిందే.మొదటివారం బేబక్క ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయింది.

ఇది ఇలా ఉంటే తాజాగా రెండో వారం నామినేషన్స్ కూడా వేడివేడిగానే సాగాయి.ఈ నామినేషన్స్ లో ముందుగా కిరాక్ సీతకు,( Kirrak Seetha ) సోనియా కు( Sonia ) పెద్ద గొడవే జరిగింది.

సోనియా సీతను నామినేట్ చేసింది.దానికి ఆమె చెప్పిన రీజన్ పై సీత మండిపడింది.

Advertisement

గట్టిగానే ఇచ్చిపడేసింది.

ఆ తర్వాత విష్ణు ప్రియ( Vishnu Priya ) సోనియాను నామినేట్ చేసింది.గతవారం జరిగిన నిఖిల్ ఇష్యూ గురించి మాట్లాడుతూ.నేను అన్న దానికి సారీ చెప్పాను.

కానీ నాపైన అడల్ట్రీ అనే ముద్ర వేశారు మీరు, దానికి నాకు సారీ చెప్పలేదు అని విష్ణు ఫిర్యా చెప్పింది.దానికి సోనియా వాదించింది.నీకు అది కామెడీ ఏమో కానీ నాకు కాదు.

మన ఇద్దరి మధ్య ఆ ర్యాపో లేదు.నాకు అది అడల్ట్రీనే అని సోనియా సీరియస్ గా చెప్పింది.

ఇన్స్టెంట్ గా గ్లోయింగ్ స్కిన్ ను పొందాలనుకుంటున్నారా.. అయితే ఇది ట్రై చేయండి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 28, గురువారం, 2021

నేను ఏం అడల్ట్రీ జోక్స్ వేసాను? చెప్పండి అని విష్ణు ప్రియా అడిగితే.మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేంత గొప్పదాన్ని కాదు అని సోనియా అంది.

Advertisement

ఒకళ్లే తెలివైనోళ్లు కాదు, పిల్ల బచ్చా జోకులేసుకునే దాన్ని అడల్ట్రీ అని ఎట్లా అంటారు అని మరోసారి విష్ణు ప్రియా అడిగేసరికి బరాబర్ ఇప్పుడు కూడా అంటూ వాదించింది సోనియా.

ఆ తర్వాత సోనియా బాలన్స్ తప్పింది.బట్టలు సరిగ్గా వేసుకొని ఒక మనిషి పక్కన నిల్చోవాలన్నది కూడా నీకు తెలీదు.ఆయన ఒకవైపు అన్ కంఫర్టబుల్ అంటున్నా కూడా ఆయన పక్కకే వెళ్లి నిల్చొని చేసిందంతా ఏంటి, నీ మాటలు, చేతలు హౌస్‌లో అందరికీ అలానే అనిపిస్తాయి అంటూ రెచ్చిపోయి మాట్లాడింది సోనియా.

దానికి విష్ణు ప్రియా కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.ఎవరు నా వల్ల అలా ఫీల్ అయ్యారో వాళ్లు చెబుతారు.వాళ్ల గురించి మీరెందుకు చెప్పడం, దేవుడిచ్చిన జ్ఞానాన్ని, విద్యని కరెక్ట్‌గా వాడాలి అంటూ సోనియా పై కౌంటర్ వేసింది విష్ణు ప్రియ.

సీత విష్ణు ప్రియా ఇద్దరూ సోనియా పై విరుచుకుపడ్డారు.అటు సోనియా కూడా ఎక్కడ తగ్గకుండా, ఇద్దరి పై మాటల యుద్ధం చేసింది.

మొన్నటికి ముద్దుగుమ్మల మధ్య గట్టిగానే నామినేషన్స్ రచ్చ జరిగింది.

తాజా వార్తలు