బిగ్ బాస్ అంటే ప్రేక్షకులకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మరి తెలుగులో కూడా బిగ్ బాస్ ( Bigg Boss )స్టార్ట్ అయ్యి 6 సీజన్స్ ముగించుకుని 7వ సీజన్ ఈ మధ్యనే స్టార్ట్ అయ్యింది.
గత సీజన్ ప్లాప్ అవ్వడంతో ఈసారి అన్ని పగడ్బందీగా ప్లాన్ చేసి సీజన్ 7 ను సెప్టెంబర్ 3న గ్రాండ్ గా అట్టహాసంగా స్టార్ట్ చేసింది.ఇప్పటికే రెండు వారాలు పూర్తి కూడా చేసుకుంది.
మూడవ వారం కూడా ముగింపు అయ్యే దశకు చేరుకుంది.ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జుననే( Nagarjuna ) చేస్తుండగా ఈసారి హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.అందులో ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ కూడా అయ్యారు.ఇక ఈ వారం కూడా హౌస్ లో ఎలిమినేషన్ జరగనుంది.ఇదిలా ఉండగా ఈసారి బిగ్ బాస్ 7 ( Bigg Boss 7 )లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో సింగర్ దామిని( Singer Damini ) ఒకరు.దామిని తన గాత్రం తోనే కాకుండా అందమైన రూపంతో కూడా ప్రతీ ఒక్కరిని ఆకట్టు కుంటుంది.
ఈమె బాహుబలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని అప్పటి నుండి వరుస ఆఫర్స్ అందుకుంటుంది.దామిని ఇప్పటి వరకు పడింది పదుల సంఖ్యలోనే అయినా ఫాలోయింగ్ మాత్రం బాగానే సంపాదించు కుంది.
ఇక ముందు నుండి సోషల్ మీడియాలో( Social media )సైతం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.
పాటలతో మాత్రమే కాకుండా తన బ్యూటిఫుల్ ఫొటోలతో కూడా వావ్ అనిపిస్తుంది.దీంతో ఈమె అందానికి చాలా మంది ఆకర్షించడంతో ఇక్కడ కూడా భారీ ఫాలోయింగ్ ఉంది.ఇదిలా ఉండగా ఇప్పుడు బిగ్ బాస్ లో సైతం అలరిస్తున్న ఈ భామ వారానికి ఎంత తీసుకుంటుందో తెలుసా? బిగ్ బాస్ ( Bigg Boss ) లో ఆటతీరుపై అమ్మడిపై ట్రోల్స్ వస్తున్నాయి.సేఫ్ గేమ్ ఆడుతుంది అంటూ అమ్మడి ఆట తీరుపై విమర్శలు ఎదురవుతున్నాయి.ఇదిలా ఉంటే ఈ భామనే ఈ వారం ఎలిమినేట్ అవుతుంది అంటున్నారు.దీంతో ఈమె రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈమె వారానికి 2 లక్షల రెమ్యునరేషన్ అందుకుంటున్న టాక్.