తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే అప్పుడే 14వ వారం ముగింపు దశకు చేరుకుంది.ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ లో జరిగిన దయ్యం టాస్క్ తో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ షో కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు షో నిర్వాహకులు.ఇక ఆ ప్రోమోలో నాగార్జున దెయ్యాలను చూసి భయపడిపోయిన కంటెస్టెంట్లను చూసి మేము కూడా బాగా నవ్వుకున్నాము.
ఈ సీజన్ లోనే మోస్ట్ ఎంటర్ టైనింగ్ వీడియో అంటూ దెయ్యం టాస్కులో కంటెస్టెంట్లు ఏ రేంజ్‌లో భయపడ్డారో మరోసారి చూపించాడు.దాంతో శ్రీ సత్య తో పాటు అక్కడున్న వారందరూ పగలబడినవారు.
మరి ముఖ్యంగా శ్రీహాన్ భయపడిన విషయాన్ని చూపిస్తూ నాగార్జున ఇంకా బాగా నవ్వారు.ఆ తర్వాత అవతలి వాళ్లకంటే నేనే ఎందుకు బెస్ట్, నాకే ఎందుకు ఓట్లు వేయాలో చెప్పమంటూ ఓ టాస్క్ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున.
అప్పుడు రేవంత్ నవ్వుకుంటూ అప్పుడే ఫిట్టింగ్ పెట్టేశారా సార్ అని అంటాడు.అప్పుడు మొదట నాగార్జున శ్రీహాన్ ని అడుగుతూ రేవంత్ కన్నా నువ్వెందుకు బెటర్? నీకెందుకు ఓట్లేయాలో చెప్పు అని అడగడంతో మొదట చెప్పడానికి తడబడిన శ్రీహాన్ ఆ తర్వాత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తప్పులు చేస్తుంటారు.కానీ దాన్ని ఒప్పుకోగలగాలి.ఆ గుణం రేవంత్ కు లేదు అన్నాడు.
అప్పుడు సార్ ఇంకొక విషయం గుర్తుకువచ్చింది చెప్పొచ్చా? అని పర్మిషన్ అడిగాడు.

అప్పుడు వెంటనే నాగార్జున రేవంత్ ఫ్లిప్పర్, నేను కాదంటావు, అంతేనా నా అని అడగగా అది కాదన్నాడు శ్రీహాన్. మరి మొన్న నువ్వు ఆదిరెడ్డితో అదే అన్నావుగా అని నాగ్ అనగా అలా అనలేదని సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు.ఇంతలోనే రేవంత్ కలగజేసుకుంటూ శ్రీహాన్ నా వెనకాల మాట్లాడతాడని తెలుసు అని అనడంతో ఆ మాటకు ఒక్కసారిగా శ్రీహాన్ షాక్ అయ్యాడు.
అప్పుడు నాగార్జున ఆదిరెడ్డిని ప్రశ్నిస్తూ.శ్రీహాన్ ఫ్లిప్పర్ అనే పదం వాడాడా? లేదా? అని అడగ్గా వెంటనే ఆది రెడ్డి తనకు గుర్తు లేదని బదులివ్వడంతో అప్పుడు నాగార్జున నిన్ను మించిన ఫ్లిప్పర్ లేడులే అంటూ రెడ్డి పై సెటైర్ వేయడంతో తలదించుకున్నాడు ఆదిరెడ్డి.







