తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ స్టార్స్ లో అనన్య పాండే కూడా ఒకరు.
ఈ ముద్దుగుమ్మ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది.మరి ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది అనన్య పాండే.
ఇది ఇలా ఉంటే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాతో ఈమె తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.భారీ బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆమె లైఫ్ ను మార్చేస్తుందని, సినిమా హిట్ కాకపోయినా కనీసం ఆమెకు పాన్ ఇండియా హీరోయిన్ అన్న క్రేజ్ దక్కుతుందని భావించింది అనన్య పాండే.
కానీ ఆమె అంచనాలను బెడిసి కొడుతూ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో పాటుగా ఆమెపై భారీగా ఎఫెక్ట్ పడింది.అయితే పూరి జగన్నాథ్ అలాగే విజయ్ దేవరకొండ వారి ఇమేజ్ కి ఏమాత్రం డ్యామేజ్ లేదు.
కానీ లైగర్ సినిమా ఎఫెక్ట్ అనన్య పాండే పై ఎక్కువగా పడింది.అంతేకాకుండా లైగర్ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ పై వరుసగా ట్రోలింగ్స్ జరుగుతూనే ఉన్నాయి.
ఒక వర్గం ప్రేక్షకులు లైగర్ సినిమాలో హీరోయిన్ గా అనన్య పాండేకి బదులుగా మరొక హీరోయిన్ ని తీసుకుంటే బాగుండేది అన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ లైగర్ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలే లేవు.
లైగర్ సినిమాకు ముందు కమిట్ అయిన రెండు సినిమాలు తప్పితే ఆమె ఎంత ప్రయత్నించినప్పటికీ మూవీ మేకర్స్ ఆమెకు ఛాన్సులు ఇవ్వడానికి సిద్ధంగా లేరని బాలీవుడ్ సినీ వర్గాలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అవకాశాలు లేకపోవడంతో ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ ను కూడా భారీగా తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకుందట.దీంతో ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు 80 లక్షల వరకు తీసుకుంటున్న ఆమె లైగర్ సినిమా ఎఫెక్ట్ వల్ల 30 లక్షలు వరకు తగ్గించేసి కేవలం 50 లక్షలు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకోవడానికి సిద్ధపడిందట.అయితే రెమ్యూనరేషన్ భారీగా తగ్గించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం రావడం లేదు.
దీంతో అనన్య పాండే తో పాటు అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.మరి ప్రస్తుతం అనన్య పాండే చేతిలో ఉన్న ఆ రెండు ప్రాజెక్ట్స్ అయినా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తెచ్చి పెడతాయో లేదో చూడాలి మరి.







