ఈవీ వెహికల్ కొన్నవారికి భారీ షాక్‌.. జులై 1 నుంచి కొత్త నిబంధనలు?

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా రోడ్లమీద ఎలక్ట్రిక్‌ వెహికల్స్ ( Electric vehicle )పరిగెడుతున్నాయి.కరోనా తరువాత ఆయిల్స్ రేట్స్ ఆకాశాన్నంటడంతో అప్పటికే వాడుతున్న డీసెల్, పెట్రోల్ వెహికల్స్ ని పక్కనబెట్టి జనాలు ఎలక్ట్రిక్‌ వెహికల్స్ వైపు మళ్లారు.

 Big Shock For Ev Vehicle Buyers.. New Rules From July 1? Big Shock , Latest News-TeluguStop.com

అయితే తాజాగా ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనాలనుకున్నవారికి కేంద్రం షాకిచ్చినట్టు తెలుస్తోంది.విషయం ఏమంటే, ఎలక్ట్రిక్‌ బైక్‌ల వినియోగాన్ని ప్రోత్సహించేలా కొనుగోలు దారులకు అందించే సబ్సీడీని భారీగా తగ్గించనుంది.

దీంతో ఈవీ బైక్స్‌ ధరలు ఆకాశాన్నంటనున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Telugu Big Shock, July, Key, Latest-Latest News - Telugu

అవును, కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పర్యావరణ హితమైన విద్యుత్‌ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేలా ఓ స్కీంను ప్రవేశ పెట్టింది.అదే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్‌-2) స్కీం.ఈ పథకంలో భాగంగా విద్యుత్ వాహనాల కొనుగోలుపై ఒక కేడబ్ల్యూహెచ్‌( KWH )కు వున్న రూ.10వేల సబ్సిడీని రూ.15 వేలకు పెంచి వేసింది.దాంతో వాహనం ఖరీదులో 20 శాతమే అందించే సబ్సిడీని సైతం 40 శాతానికి పెంచడం గమనార్హం.ఇప్పుడా 40 శాతం సబ్సీడీని 15 శాతానికి తగ్గిస్తూ కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Telugu Big Shock, July, Key, Latest-Latest News - Telugu

కాగా తగ్గించిన సబ్సీడీ జూన్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు భోగట్టా.గత ఏప్రిల్‌ నెలలో ఈవీ వాహనాల కొనుగోళ్లు చాలా ఎక్కువగా పెరిగినట్లు తెలుస్తోంది.21 శాతం వృద్దితో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ నెల వరకు 1,10,503 యూనిట్లు అమ్ముడు పోగా ఇదే నెలలో దేశంలోని ఉత్తర్‌ ప్రదేశ్‌, మహరాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లలో మొత్తం కలుపుకొని 21,845 వెహికల్స్‌ను కొనుగోలు చేయడం విశేషం.ఇలాంటి పరిస్థితులలో రానున్న రోజుల్లో మరిన్ని వాహనాలు అమ్ముడు కానున్నాయి.

ఇలాంటి శుభ తరుణంలో తాజా కేంద్రం నిర్ణయం ఎటు దారి తీస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube