విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు భారీ ఊరట లభించింది.ఇకపై యాభై శాతం సర్వీసులనే నడపాలని స్పైస్ జెట్ పై విధించిన పరిమితిని డీజీసీఏ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
శీతాకాల షెడ్యూల్లో పూర్తి స్థాయిలో విమానాలను నడిపేందుకు వీలు కల్పించింది.స్పైస్ జెట్ పై జులై 27న డీసీజీఏ ఆదేశాలు జారీ చేయగా సెప్టెంబర్ లో మరోసారి పొడిగించింది.
తాజాగా ఈ ఆంక్షలను పూర్తిగా తొలగించింది.అయితే, తరచూ సాంకేతిక కారణాలు ఎదుర్కొంటున్న కారణంగా స్పైస్ జెట్ పై గతంలో పరిమితులను విధించిన సంగతి తెలిసిందే.







