టాలీవుడ్ హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా పేరును చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.బాలయ్య హీరోగా నటించే 107వ సినిమా ఇది.
కర్నూలు జిల్లాలోని కొండారెడ్డి బురుజు వేదికగా ఈ సినిమా పేరును ప్రకటించారు.దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పేరు వీరసింహారెడ్డిగా ఖరారు చేసినట్లు వెల్లడించారు.
రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా గతంలో తెరకెక్కిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.ఈ తరహాలోనే మరోసారి రాయలసీమ నేపథ్యంతోనే బాలయ్య కొత్త చిత్రం తెరకెక్కనుందని చిత్ర బృందం స్పష్టం చేసింది.







