హీరో బాలకృష్ణ 107వ సినిమా పేరు ప్రకటన
TeluguStop.com
టాలీవుడ్ హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా పేరును చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
బాలయ్య హీరోగా నటించే 107వ సినిమా ఇది.కర్నూలు జిల్లాలోని కొండారెడ్డి బురుజు వేదికగా ఈ సినిమా పేరును ప్రకటించారు.
దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పేరు వీరసింహారెడ్డిగా ఖరారు చేసినట్లు వెల్లడించారు.
రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా గతంలో తెరకెక్కిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
ఈ తరహాలోనే మరోసారి రాయలసీమ నేపథ్యంతోనే బాలయ్య కొత్త చిత్రం తెరకెక్కనుందని చిత్ర బృందం స్పష్టం చేసింది.