జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి నాలుగో విడత యాత్రలో భాగంగా వైసిపి ప్రభుత్వం ను టార్గెట్ చేసుకుంటూ అనేక విమర్శలు చేస్తున్నారు.ఈ క్రమంలో వైసిపి కూడా పవన్ వ్యాఖ్యలకు ఘాటుగానే సమాధానం ఇస్తూ కౌంటర్లు వేస్తోంది.
కురుక్షేత్ర యుద్ధం కౌరవులు పాండవులు అంటూ పవన్ వైసీపీ( YCP ) ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటున్నారు .రాబోయే ఎన్నికలను కురుక్షేత్ర యుతంగా పవన్ చెబుతూ యుద్ధానికి సిద్ధమంటూ ప్రకటనలు చేస్తున్నారు.కృష్ణాజిల్లా అవనిగడ్డ వారాహి యాత్రలో పవన్ ఈ తరహా పంచ్ డైలాగులతో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కౌరవులు ఎవరో పాండవులు ఎవరో సీఎం జగన్ తేల్చుకోవాలని పవన్ సూచించారు.

యువతను మోసం చేసిన వైసీపీని అధికారానికి దూరం చేయడమే తమ లక్ష్యమని , రాబోయే రోజుల్లో జనసేన టిడిపి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పవన్ వ్యాఖ్యానిస్తున్నారు.అయితే పవన్ వ్యాఖ్యలకు వైసీపీ కూడా ఘాటుగానే సమాధానాలు ఇస్తుంది .పవన్ రాజకీయాలకు పనికిరాని వ్యక్తి అంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.బిజెపితో ఉంటూ టిడిపితో పొత్తు పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు.
జనసేన కార్యకర్తలు సైనికులు కాదు సైకిల్ సైనికులు అంటూ అంబటి ఎద్దేవా చేశారు.చంద్రబాబు అవినీతి డబ్బుతో వారాహి యాత్రను పవన్ చేపట్టారని అంబటి విమర్శించారు.

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. వైసిపి 15 సీట్లు వస్తాయి అంటున్న పవన్ వచ్చే ఎన్నికల్లో కనీసం 15 సీట్లలోనైనా పోటీ చేయగలరా అని ప్రశ్నించారు. పవన్ కు దమ్ముంటే 175 సీట్లలో అభ్యర్థులను నిలబెట్టాలని సవాల్ చేశారు.అవినీతిపరుడైన చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కు జగన్ విమర్శించే హక్కు లేదని ఆయన మండిపడ్డారు.
.