చిత్రం : బెతాలుడుబ్యానర్ : విజయ్ ఆంటోని ఫిలిం కార్పోరేషన్దర్శకత్వం : ప్రదీప్ కృష్ణమూర్తినిర్మాత : ఫాతిమా విజయ్ అంటోని సంగీతం : విజయ్ అంటోనివిడుదల తేది : డిసెంబర్, 1, 2016నటీనటులు : విజయ్ అంటోని, అరుంధతి నయర్
కొత్తరకం సినిమాలతో హీరోగా మారిన తమిళ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని.తమిళనాట మంచి క్రేజ్ ఉన్న ఈ నటుడు, బిచ్చగాడు చిత్రంతో తెలుగు మార్కేట్ ని సంపాదించాడు.
మరి బిచ్చగాడు లాంటి భారి హిట్ తరువాత వచ్చిన బెతాలుడు ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళ్తే …
తెలివితేటలు బాగా కలిగిన దినేష్ (విజయ్ అంటోని) హైదరాబాద్ లోని ఓ కార్పోరేట్ కంపెనిలో పనిచేస్తుంటాడు.
ఐశ్వర్య (అరుంధతి నయర్) తో పెళ్ళి జరిగిన తరువాత ఇతని జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి.తనతో ఎవరో మాట్లాడినట్లుగా, తనకేదో చెప్పినట్లుగా, మామూలు ప్రపంచానికి అతీతమైన ఘటనలు దినేష్ జీవితంలో జరుగుతుంటాయి.
దినేష్ మానసిక ఒత్తిడికి తన పూర్వ జన్మకి సంబంధం ఉన్నట్లుగా సైకాలాజి థెరపిలో తెలుతోంది.అదే ట్రీట్‌మెంటు సమయంలో దినేష్ పూర్వజన్మలో శర్మ అనే తెలుగు మాస్టారు అని, తనని జయలక్ష్మీ అనే మహిళ చంపినట్లు తెలుస్తుందిఇంతకి జయలక్ష్మీ ఎవరు ? తను శర్మని ఎందుకు చంపినట్లు, దినేష్ ఇదంతా ఊహించుకుంటున్నాడా లేక తనకి నిజంగానే పూర్వ జన్మ గుర్తుకు వచ్చిందా ? ఈ ప్రశ్నలకు సమాధానాలు థియేటర్లోనే దొరుకుతాయి.
నటీనటుల నటన గురించి
సబ్టిల్ గా సాగిన విజయ్ అంటోని పెర్ఫార్మెన్స్ బాగుంది.కాని కొన్నిచోట్ల ఆ సబ్టిల్ నెస్ అవసరమైన ఏమోషన్ ని తెరపైకి తీసుకురాలేకపోయింది.
క్లయిమాక్స్ లో విజయ్ నటన ఆకట్టుకుంటుంది.అరుంధతి తనకిచ్చిన పాత్రలో అతికినట్టు సరిపోయింది.
మిగితా పాత్రధారులు ఫర్వాలేదు.
సాంకేతికవర్గం పనితీరు
సినిమాటోగ్రాఫి బాగుంది.
కొన్ని షాట్స్ ఇలాంటి మీడియం స్కేల్ బడ్జెట్ సినిమాల్లో మనం ఊహించడం కష్టం.విజయ్ అంటోని స్వయంగా అందించిన సంగీతం బాగుంది.
జయలక్ష్మీ అంటూ సాగే పాట ఇప్పటికే బాగా పాపులర్ అయ్యింది.నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది.
థ్రిల్లర్ సినిమాల్లో ఊహించుకునే ఎడిటింగ్ ఇందులో లేదు.ముఖ్యంగా సెకండాఫ్ బాగా దెబ్బతీసింది.
విశ్లేషణ
సినిమా విడుదలకి ముందు ఓ పది నిమిషాలు యూట్యూబ్ లో పెట్టాడు విజయ్ ఆంటోని.ఆ వీడియో చూసినవారందరికి ఈ సినిమా మీద ఆసక్తి కలిగి ఉంటుంది.
నిజానికి సినిమాలో ఆసక్తికరంగా నిమిషాలు అవే.ఆ తరువాత సినిమా మెలిమెల్లిగా, ఊహించని విధంగా కిందకి పడిపోతూ ఉంటుంది.ఇలాంటి ప్లాట్ కి దర్శకుడు అల్లుకున్న లేయర్స్ ఏమాత్రం కొత్తగా లేవు.ఇంటర్వెల్ ట్విస్టు ముందే అర్థమయిపోతుంది.సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ పూర్తయిన కాసేపటికే క్లయిమాక్స్ కూడా అర్థమయిపోతుంది.ఒక్కమాటలో చెప్పాలంటే నాసిరకం సెకండాఫ్.
మనం ఎన్నో తెలుగు సినిమాల్లో చూసిన మెడికల్ మాఫియాని ఇరికించేసాడు.ఆసక్తికరమైన కథ చెప్పటం మొదలుపెట్టి, గొంతు కోసినంత పని చేశాడు దర్శకుడు.
పోని, ఇదంతా పట్టించుకోని మాస్ ప్రేక్షకుడినైనా ఆకట్టుకుంటుందా అంటే, అదీ లేదు.
హైలైట్స్ :
* మొదటి అరగంట* జయలక్ష్మీ సాంగ్, నేపథ్య సంగీతం
డ్రాబ్యాక్స్ :
* కొత్తగా అనిపించే లైన్ కి పాత పూత* స్లో నరేషన్* ఏ వర్గం ప్రేక్షకులని కూడా ఆకట్టుకోని కథాంశం
చివరగా :
బేతాళకథల కన్నా పాత కథ
తెలుగుస్టాప్ రేటింగ్ : 2/5