మహేష్ బాబు సినిమాలో మూడవ హీరోయిన్‌ వార్తలపై నిర్మాత క్లారిటీ

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ అనే విషయం తెలిసిందే.ఆమె మాత్రమే కాకుండా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీల కూడా మరో హీరోయిన్ గా కనిపించబోతుంది.

 Bhumi Pednekar In Mahesh Babu Movie News Clarity , Bhumi Pednekar , Sreeleela ,-TeluguStop.com

శ్రీ లీల సెకండ్ హీరోయిన్ కాదని మెయిన్ హీరోయిన్ అంటూ ఆ మధ్య నిర్మాత నాగ వంశీ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.ఇక ఈ సినిమా లో మూడవ హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ భూమి పడ్నేకర్‌ నటిస్తోంది అంటూ ప్రచారం జరిగింది.

మహేష్ బాబు, త్రివిక్రమ్‌ సినిమా లో ఆమె కానిస్టేబుల్ పాత్ర లో కనిపించబోతుందని కూడా పుకార్లు షికార్లు చేశాయి.అయితే ఈ చిత్రం లో భూమి పడ్నేకర్‌ నటిస్తుందని వచ్చిన వార్తలపై నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు.

నిర్మాత నాగ వంశీ ఇటీవల ఒక సందర్భంగా మీడియా వారితో ముచ్చటిస్తూ.మహేష్ బాబు సినిమా లో భూమి పడ్నేకర్‌ నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు అన్నీ కూడా పూకారులు అంటూ కొట్టి పారేశాడు.ఈ సినిమా లో కేవలం ఇద్దరి హీరోయిన్స్ మాత్రమే కనిపించబోతున్నారని.ఇతర వార్తలన్నీ కూడా నిజం కాదని చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా క్లారిటీ ఇవ్వడంతో ఇన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కి తెర పడ్డట్టు అయింది.

మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో అంచనాల ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

వీరిద్దరి కాంబినేషన్ లో గతం లో అతడు మరియు ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.ఆ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు.అయినా కూడా మంచి ఆదరణ ను బుల్లి తెరపై దక్కించుకున్నాయి.

కనుక ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.భారీగా ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube