బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో హత్యోదంతం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నిన్న సాయింత్రం యం.
సి.ఏ.రెండవ సంవత్సరం చదువుతున్న గౌరవ్ సింగ్ అనే విద్యార్ధి విశ్వవిద్యాలయ ఆవరణలో స్నేహితులతో మాట్లాడుతుండగా గుర్తు తెలియని దుండగులు మోటారు సైకిలుపై వచ్చి కాల్పులు జరిపారు.గౌరవ్ సింగ్ పొట్టలో,మరియు చాతిలో బుల్లెట్లు దిగి విపరీతమైన రక్త స్రావమై అక్కడికక్కడే మృతి చెందాడని ప్రత్యక్ష కొందరు సాక్షులు చెబుతుండగా కాదు ఆసుపత్రిలో వైద్యం చేస్తుండగా చనిపోయాడని ఇంకొందరి చెబుతున్నట్లు తెలుస్తుంది.
పోలీసులు కేసు రిజిస్టరు చేసి విచారిస్తున్నారు.ఇప్పటికే 4 గురు అనుమానితులను అదుపులోనికి తీసుకొన్నారు. ఇది ఇలా వుండగా గౌరవ్ సింగ్ ను యునివర్సిటి పాలనా యంత్రాంగం గత సంవత్సరం జరిగిన గొడవల్లో అతని పాత్ర ఉందని అతనిని యునివర్సిటి నుండి బహిష్కరించడం జరిగినట్లు తెలుస్తుంది.మృతుని తండ్రి రాకేష్ ప్రసాద్ సింగ్ తన కుమారుని మృతికి విశ్వవిద్యాలయ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు రోయనా సింగ్, మరియు సభ్యులు కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
మృతునికి జిల్లా వైద్యశాలలో పోస్టుమార్టం పూర్తి అయిన పిదప కాశీలోని గంగ వడ్డున హరిశ్చంద్ర ఘాట్లో అంత్యక్రియలు జరిగాయి.ఈరోజు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి సెలవు ప్రకటించారు.







