ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ ( Big Boss )ఎంత ఆసక్తికరంగా సాగుతూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాము.‘ఉల్టా పల్టా’ కాన్సెప్ట్ తో మొదలైన ఈ సీజన్ ఆ టైటిల్ కి తగ్గట్టుగానే ఊహించని మలుపులతో ముందుకు దూసుకుపోతుంది.గత వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా 5 మంది కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.వారిలో నయని పావని మొన్న ఎలిమినేట్ అయ్యింది.
ఇప్పుడు ఎలిమినేట్ అయినా పాత కంటెస్టెంట్స్ లో ఒకరిని హౌస్ లోపలకు పంపబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.శుభ శ్రీ, రతికా మరియు దామినిలలో ఇంటి సభ్యుల చేత ఎవరికైతే తక్కువ ఓట్లు వచ్చాయో, ఆ కంటెస్టెంట్ హౌస్ లోకి ఎంటర్ అవ్వబోతుంది.
విశ్లేషకుల సమాచారం ప్రకారం, ఆ కంటెస్టెంట్ రతికా అని తెలుస్తుంది.ఈమె ఎప్పుడు హౌస్ లోకి ఎంటర్ అవ్వబోతుంది అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఇకపోతే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో అందరూ మంచిగానే ఉన్నారు కానీ, భోలే షావలి( Bhole Shawali ) అనే వ్యక్తి మాత్రం హౌస్ మేట్స్ సహనంతో పాటు, ఆడియన్స్ సహనం కి కూడా పరీక్ష పెడుతున్నాడు.హౌస్ లో ఒక్క గేమ్ ఆడడం కూడా రాదు, కానీ కంటెస్టెంట్స్ అందరిని ట్రిగ్గర్ చేయడం లో మాత్రం ముందు ఉంటాడు.ముఖ్యంగా ఆడవాళ్ళతో ఇతను వ్యవహరించే తీరు చాలా అసభ్యంగా ఉంటుంది.నోటికి హద్దు అదుపు అసలు ఉండడం లేదు, ఏది తోచితే అది మాట్లాడేస్తున్నాడు.ముఖ్యంగా శోభా శెట్టి ( Shobha Shetty )క్యారక్టర్ పై ఇతను చేస్తున్న వ్యాఖ్యలు చాలా కోపం తెప్పిస్తున్నాయి.ఈమె ‘కార్తీక దీపం’ ( Karthik Deepam )అనే బ్లాక్ బస్టర్ సీరియల్ లో మెయిన్ విలన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఆ సీరియల్ లో ఆమె పేరు మోనిత.
అందులో ఆమె శాడిస్ట్ లాగ ఎలా ప్రవర్తిస్తుందో, బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే ప్రవర్తిస్తుందని, ఆమె నిజమైన క్యారక్టర్ అదే అంటూ కామెంట్ చేసాడు.ఒక వ్యక్తి క్యారక్టర్ ని నలుగురిలో ఇలా బ్యాడ్ చెయ్యడం ఎంత వరకు సబబు అని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.అలాగే ప్రియాంక( Priyanka ) ని కూడా వెక్కిరిస్తూ నిన్న నామినేషన్స్ సమయం లో అతను వేసిన వేషాలు చూసేవారికి చాలా చిల్లర గా అనిపించింది.
ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే మధ్యలో దూరి వాళ్ళ మధ్య గొడవలు పెట్టడం, రెచ్చగొట్టేలా మాట్లాడి మళ్ళీ తిరిగి కౌంటర్లు ఇస్తే ఇంకా రెచ్చగొట్టేలా చెయ్యడం ఇలాంటివి హౌస్ లో చాలా అలజడికి గురి చేస్తున్నాయి.ఈ వారం ఇతనికి నాగార్జున చేతిలో కచ్చితంగా కోటింగ్ ఉంటుంది.
పద్దతి మార్చుకోకపోతే భవిష్యత్తులో ఇతనికి ఓటింగు సంబంధం లేకుండా రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపేయొచ్చు కూడా.