Bhole Shavali: నువ్వు మంచి పాటగాడివే.. కానీ ఆ ఒక్కటి తగ్గించుకో భోలే

భోలే షావలి( Bhole Shavali )వైల్డ్ కార్డు ఎంట్రీగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు.కానీ వచ్చిన మొదటి వారమే అతడి అతి వాగుడుతో జనాలకు విసుగు తెప్పించాడు.

 Bhole Shavali: నువ్వు మంచి పాటగాడివే.. క-TeluguStop.com

కానీ బోలేకీ ఎక్కడో సుడి గట్టిగా ఉంది.అందుకే ప్రియాంక, శోభ శెట్టి లతో గొడవ పడి తన క్రేజ్ పెంచుకున్నాడు.

Telugu Ashwini, Bhole Shavali, Bigg Boss, Priyanka, Shobha Shetty, Tollywood-Mov

మొత్తానికి వీరిద్దరి పుణ్యమా అని హౌస్ లో అయితే కొనసాగుతున్నాడు కానీ అప్పుడప్పుడు బోలే చేసే వాదనలు జనాలకు విసుగులు తెప్పిస్తున్నాయి.మంచి పాటగాడిగా గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు కానీ అతి వాగుడే అతని కొంప ముంచేలా కనిపిస్తుంది.

Telugu Ashwini, Bhole Shavali, Bigg Boss, Priyanka, Shobha Shetty, Tollywood-Mov

పైగా ఒకపక్క అశ్విని( Ashwini ) ని చెల్లి అంటూనే ఆమెతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ నీ బుగ్గలు బాగుంటాయి, నీ బాడీ బాగుంటుంది అంటూ వేగటు వ్యాఖ్యలు కూడా చేస్తున్నాడు.ఇవి చూడ్డానికి చాలా చిరాకు తెప్పిస్తున్నాయి.ఇక మరోవైపు పల్లవి ప్రశాంత్( Pallavi prashanth ) కి హౌస్ బయట మంచి సపోర్ట్ దొరికిందని బోలె కి ముందు నుంచి తెలుసు కాబట్టి అటు సైడ్ గానే తన పావులు కదుపుతున్నాడు.పల్లవి ప్రశాంతి ఏడ్చిన ప్రతిసారి అతను కూడా ఏడుస్తూ జనాలతో ఏంటి ఈ బేకార్ పంచాయితీ అనే విధంగా కనిపిస్తున్నాడు.

ఒక కంటెస్టెంట్ ఏడవడమే చూడ్డానికి జనాలు ఒప్పుకోవడం లేదు.పల్లవి ప్రశాంత్ కి సమస్య వచ్చిన సరే బోలే ఏడవడమే మరీ విచిత్రంగా ఉంది.

Telugu Ashwini, Bhole Shavali, Bigg Boss, Priyanka, Shobha Shetty, Tollywood-Mov

ఇలా పల్లవి ప్రశాంత్ ఫాలోవర్స్ ని తన ఫాలోవర్స్ గా మార్చుకునే ప్రయత్నం అని అనుకున్నా కూడా తన ప్రవర్తన మార్చుకోకపోతే ముందు ముందు చాలా కష్టం అవుతుంది.ఆటలో కూడా ఎక్కడా చురుకుదనం కనిపించడం లేదు.కేవలం తను రకరకాల పాటలు ఎమోషన్ తో కూడిన మాటలు చెబుతూ జనాలను అట్రాక్ట్ చేసే పని పెట్టుకున్నాడు.ఇదంతా ఆటలో భాగమే అయినప్పటికీ కాస్త ఆడితే కూడా చూడాలని జనాలు కోరుకుంటున్నారు.

ఏది ఏమైనా బోలె షావలి మాత్రం అవతల వాడు ఏం చెప్పినా వినే టైప్ కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube