'భోళా మ్యానియా' స్టార్ట్.. ఫస్ట్ సాంగ్ కు టైం అండ్ డేట్ అనౌన్స్!

గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి రెండు సక్సెస్ ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’( Bhola Shankar movie ).ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని తహతహ లాడుతున్నాడు.

 Bhola Shankar First Single Update Details, Bhola Shankar First Single, Bhola Sha-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈయన నెక్స్ట్ సినిమాపై ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలను పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెహర్ రమేష్( Meher Ramesh ) డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా. కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.అలాగే అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా నుండి తాజాగా మేకర్స్ అఫిషియల్ గా ఒక అప్డేట్ ఇచ్చారు.ఈ సినిమా మ్యూజిక్ మ్యానియా త్వరలోనే స్టార్ట్ అవుతుంది అని మేకర్స్ మొన్ననే చెప్పారు.

ఈ క్రమంలోనే ఈ రోజు మ్యూజిక్ మ్యానియా స్టార్ట్ అంటూ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు.మరి ఈ సాంగ్ ప్రోమో రేపు జూన్ 2న రిలీజ్ చేస్తామని.అలాగే పూర్తి లిరికల్ సాంగ్ జూన్ 4న రిలీజ్ చేస్తామని చెబుతూ పోస్టర్ రిలీజ్ చేసారు.దీంతో మెగా ఫ్యాన్స్ ఈ పాట కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

మరి మహతి స్వరసాగర్ ఈ సినిమాకు ఎలాంటి స్వరాలూ సమకూర్చారో చూడాలి.ఇక ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాతో మెగాస్టార్ హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కూడా ఆశ పడుతున్నారు.రీమేక్ సినిమా అయినప్పటికీ అన్ని హంగులతో ఈ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కిస్తూ మెగా ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ రెడీ చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube