‘భోళా మ్యానియా’ స్టార్ట్.. ఫస్ట్ సాంగ్ కు టైం అండ్ డేట్ అనౌన్స్!

గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి రెండు సక్సెస్ ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భోళా శంకర్'( Bhola Shankar Movie ).

ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని తహతహ లాడుతున్నాడు.ఈ క్రమంలోనే ఈయన నెక్స్ట్ సినిమాపై ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలను పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.

తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెహర్ రమేష్( Meher Ramesh ) డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.

మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.అలాగే అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా నుండి తాజాగా మేకర్స్ అఫిషియల్ గా ఒక అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమా మ్యూజిక్ మ్యానియా త్వరలోనే స్టార్ట్ అవుతుంది అని మేకర్స్ మొన్ననే చెప్పారు.

"""/" / ఈ క్రమంలోనే ఈ రోజు మ్యూజిక్ మ్యానియా స్టార్ట్ అంటూ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు.

మరి ఈ సాంగ్ ప్రోమో రేపు జూన్ 2న రిలీజ్ చేస్తామని.అలాగే పూర్తి లిరికల్ సాంగ్ జూన్ 4న రిలీజ్ చేస్తామని చెబుతూ పోస్టర్ రిలీజ్ చేసారు.

దీంతో మెగా ఫ్యాన్స్ ఈ పాట కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

మరి మహతి స్వరసాగర్ ఈ సినిమాకు ఎలాంటి స్వరాలూ సమకూర్చారో చూడాలి.ఇక ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాతో మెగాస్టార్ హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కూడా ఆశ పడుతున్నారు.

రీమేక్ సినిమా అయినప్పటికీ అన్ని హంగులతో ఈ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కిస్తూ మెగా ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ రెడీ చేస్తున్నాడు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన