'భోళా మ్యానియా'కు అద్భుతమైన స్పందన.. అప్పుడే అన్ని మిలియన్ వ్యూస్!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’( Bhola Shankar ).అందరి అంచనాలను నిలబెట్టుకునేలా మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

 Bhola Mania Song Download Bhola Shankar , Bhola Shankar First Single, Bhola Shan-TeluguStop.com

ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ భోళా నుండి ఫస్ట్ సింగిల్ ను నిన్న రిలీజ్ చేసారు.‘భోళా మ్యానియా’( Bhola Mania ) సాంగ్ కు అద్భుతమైన స్పందన లభిస్తుంది.ఇప్పటికే ఈ సాంగ్ 12 గంటల్లోనే 3 మిలియన్ వ్యూస్ అందుకుంది.మహతి స్వర సాగర్ అందించిన సంగీతం ఆకట్టుకుంది.భోళా మ్యానియాతో మెగాస్టార్ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేసాడు.మరోసారి మెగాస్టార్ తన స్టెప్పులతో అలరిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్( Keerthy Suresh ) చిరు చెల్లెలుగా నటిస్తుంది.అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఇక ఈ సినిమా టీజర్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.తమిళ్ లో అజిత్ ( Ajith )నటించిన వేదాళం సినిమాకు అధికారిక రీమేక్ అనే విషయం తెలిసిందే.సుశాంత్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, శ్రీముఖి వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నారు.గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి రెండు సక్సెస్ ల తర్వాత మెగాస్టార్ నటిస్తున్న సినిమా ఈ సినిమాతో మెగాస్టార్ హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కూడా ఆశ పడుతున్నారు.రీమేక్ సినిమా అయినప్పటికీ అన్ని హంగులతో ఈ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కిస్తూ మెగా ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ రెడీ చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube