నటి మౌనిక రెడ్డి ( Mounika Reddy ) షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ల ద్వారా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది.మరీ ముఖ్యంగా ఈ నటికి ఎక్కువ గుర్తింపు వచ్చింది మాత్రం భీమ్లా నాయక్ ( Bhimla Nayak ) సినిమా ద్వారా.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కనే లేడీ కానిస్టేబుల్ లో చాలా ఎమోషన్స్ పండించింది.ఇక ఈమె షణ్ముఖ్ జస్వంత్ హీరోగా చేసిన సూర్య వెబ్ సిరీస్ లో చేసిన సంగతి చాలా మందికి తెలుసు.
అయితే ఈ సినిమాలే కాకుండా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన మౌనిక రెడ్డికి భీమ్లా నాయక్, సూర్య వెబ్ సిరీస్ మాత్రమే మంచి గుర్తింపుని ఇచ్చాయి.

ఇక ఈ మధ్యనే ఒక కొత్త సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంది.ఇదంతా పక్కన పెడితే మౌనిక రెడ్డి గత ఏడాది గోవాలో ఎన్నో రోజుల నుండి ప్రేమించిన సందీప్ ( Sandeep ) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.ఇక పెళ్లయ్యాక కొన్ని రోజులు బాగానే ఉన్న ఈ జంట తాజాగా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఒక వార్త తెరమీద వినిపిస్తోంది.

దానికి ప్రధాన కారణం మౌనిక రెడ్డి (Mounika Reddy) తన ఇంస్టాగ్రామ్ లో ఉన్న పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడమే కాకుండా తన భర్తని ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేయడమే.ఇక ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకున్న చాలామంది నెటిజన్స్ వీరిద్దరూ విడిపోతున్నారని అందుకే మౌనిక రెడ్డి అలా చేసింది అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకునే ముందు పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడమే కాకుండా వారి భార్య లేదా భర్త ని సోషల్ మీడియా ఖాతాలో అన్ ఫాలో చేస్తూ ఉంటారు.ఈ విధంగా మౌనిక రెడ్డి కూడా చేయడంతో విడాకులు తీసుకోబోతుంది అనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది.
మరి మౌనిక రెడ్డి నిజంగానే విడాకులు తీసుకుంటుందా లేదా అనేది తెలియాలంటే స్వయంగా మౌనిక రెడ్డి క్లారిటీ ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.