భీమ్లా నాయక్ హిట్ ఆ సినిమా డైరక్టర్ సాగర్ చంద్రని సందిగ్ధమైన పరిస్థితుల్లో పడేసింది.సినిమా డైరక్టర్ గా పేరు తనదే అయినా భీమ్లా నాయక్ సినిమా సక్సెస్ క్రెడిట్ ఎక్కువ శాతం త్రివిక్రం ఖాతాలో పడుతుంది.
జస్ట్ డైరక్టర్ గా సాగర్ చంద్ర పేరు పెట్టారని చాలామంది అనుకున్నారు.అయితే అలా టాలెంట్ లేకుండా ఉన్న డైరక్టర్ ఏమి కాదు అతను.
అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో తన సత్తా చాటాడు.భీమ్లా నాయక్ విషయంలో త్రివిక్రం హ్యాండ్ పెద్దది అవడం వల్ల డైరక్టర్ గా సాగర్ చంద్ర తన క్రియేటివిటీకి ఎక్కువ పని చెప్పాల్సిన అవసరం లేకుండాపోయింది.
భీమ్లా నాయక్ హిట్ ఇప్పుడు తన ఖాతాలో వేసుకోవాలా వద్దా అన్న కన్ ఫ్యూజన్ లో ఉన్నాడు.అయితే భీమ్లా నాయక్ త్రివిక్రం కేవలం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మాత్రమే ఇచ్చాడు సాగర్ చంద్రనే డైరక్షన్ చేశాడు అని ప్రూవ్ అవ్వాలంటే మాత్రం అతను చేసే నెక్స్ట్ సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉండాలి.
లేకపోతే డైరక్టర్ గా మాత్రం సాగర్ చంద్ర వెనకపడాల్సిన పరిస్థితి వస్తుంది.ఏది ఏమైనా డైరక్టర్ గా హిట్టు కొట్టినా భీమ్లా నాయక్ సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు డైరక్టర్ సాగర్ కె చంద్ర.
మరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తాడన్నది చూడాలి.