హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అమలాపాల్ తన మాజీ ప్రియుడు భవిందర్ పై పోలీస్ కేసు పెట్టిన విషయం మనందరికి తెలిసిందే.
తన మాజీ ప్రియుడు రవీందర్ తనని లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ అమలాపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఇక వెంటనే స్పందించిన పోలీసులు బవిందర్ ను అరెస్టు చేశారు.
కాగా తాజాగా అతను బెయిల్ కోసం కోటిలో పిటిషన్ దాఖలు చేస్తూ 2017 లో అమలాపాల్తో తన పెళ్లి జరిగింది అంటూ అందుకు సంబంధించిన సాక్షాలను కూడా దానికి జోడించాడు.అయితే భవిందర్ ఇచ్చిన సాక్షాలను పరిశీలించిన న్యాయస్థానం అనంతరం అతనికి బెయిల్ మంజూరు చేసింది.
కాగా ఈ కేసు విషయంలో మరొకసారి వీరిద్దరి పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే అమలాపాల్ 2014లో దర్శకుడు విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
కానీ పెళ్లయిన తర్వాత వారి వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడంతో మూడేళ్లకు అనగా 2017 లో విడాకులు తీసుకుని విడిపోయారు.ఆ తరువాత ఆమె సింగర్ భవిందర్ సింగ్ తో కలిసి ప్రేమలో మునిగి తేలుతోంది అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

ఈ నేపథ్యంలోనే 2020లో అమలాపాల్,భవీందర్ సింగ్ ల పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దీనితో వారు ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు అని అందరూ భావించారు.కానీ అది కేవలం ఫొటో షూట్ మాత్రమే అని అమలాపాల్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ వివాదం సద్దుమణగలేదు.అంతేకాకుండా చాలామంది ఆ పెళ్లి ఫోటోలు నిజం అని నమ్మారు.