ఇప్పటికే దేశభక్తి నేపథ్యంలో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి వారిని బాగా కనెక్ట్ చేశాయి.నిజానికి దేశభక్తి నేపథ్యంలో వచ్చే కాన్సెప్ట్ లు బాగుంటాయి.
అలా డైరెక్టర్ దీన రాజ్ కూడా దేశభక్తి కాన్సెప్ట్ తో భారతీయన్స్( Bharateeyans ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.తొలిసారిగా ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.
ఇంతకు ముందు టాలీవుడ్ లో రచయితగా చేశాడు.ఇక ఈ సినిమా తెలుగు, హిందీ భాషలలో రూపొందించబడింది.
ఇందులో నీరోజ్ పుచ్చా, సుభారంజన్, సోనమ్ టెండప్, సమైరా సందు, పెడెన్ నాంగ్యాల్, రాజేశ్వరి చక్రవర్తి, మహేందర్ బర్కాస్ తదితరులు ప్రధాన పాత్రలో చేశారు.భారత్ అమెరికన్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత శంకర్ నాయుడు అడుసుమిల్లి( Shankar naidu ) ఈ సినిమాను నిర్మించాడు.
సత్య కశ్యప్, కపిల్ కుమార్ సంగీతం అందించారు.జయపాల్ రెడ్డి నిమ్మల సినిమాటోగ్రఫీ అందించాడు.
ఇక ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకోగా ఈరోజు ఈ సినిమా థియేటర్లో విడుదలైంది.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.అంతే కాకుండా తొలిసారిగా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ ఈ సినిమాతో సక్సెస్ అయ్యాడో లేదో చూద్దాం.
కథ:
ఈ సినిమా ఒక ఆరుగురి భారతీయుల కథపై ఆధారపడి ఉంటుంది.భారత దేశం( India )లోని ఉన్న తెలుగు, భోజ్ పురి, నేపాలి, పంజాబీ, బెంగాలీ, త్రిపుర కు చెందిన ఆరుగురు వ్యక్తులలో ముగ్గురు మగవాళ్ళు, ముగ్గురు ఆడవాళ్లు ఉంటారు.అయితే వీరికి కొన్ని వేరువేరు సమస్యలు ఎదురవటంతో వాటి నుంచి బయటపడటానికి ఆలోచిస్తూ ఉంటారు.
అప్పుడే కొందరు అజ్ఞాత వ్యక్తులు వీరి జీవితంలోకి వచ్చి వారి సమస్యల నుండి బయట పడేస్తామని.ఇక దానికి ఒక సీక్రెట్ విషయం కోసం బార్డర్ దాటి చైనాకి వెళ్ళమని అంటారు.
మరి ఆ ఆరుగురు ఆ అజ్ఞాత వ్యక్తులు చెప్పినట్లు వింటారా.ఒకవేళ వింటే వాళ్లకు ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి.
చివరికి ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన
: ఈ సినిమాలో నటించిన నటీనటులు ఎమోషన్స్ సన్నివేశాలలో అద్భుతంగా మెప్పించారు.ప్రాంతానికి తగ్గట్టు ఆకట్టుకున్నారు.కానీ కొన్ని కొన్ని చోట్ల వారి పర్ఫామెన్స్ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేకపోయాయి.
మిగిలిన పాత్రల్లో నటించిన వారు కూడా పరిధి మేరకు నటించారు.

టెక్నికల్:
టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ మంచి కథను ప్రేక్షకులకు పరిచయం చేశాడు.సంగీతం బాగా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.
కొన్ని ప్రాంతాలను చాలా అద్భుతంగా చూపించారు.ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది.
నిర్మాణ విలువలు గొప్పగా కనిపించాయి.

విశ్లేషణ:
డైరెక్టర్ ప్రేక్షకులకు మంచి ఎమోషనల్ తో కూడిన కథను చూపించాడు.ప్రాంతాలు వేరైనా దేశం కోసం అందరూ కలిసి ఒకేలా పోరాటం చేయడం అద్భుతంగా ఉంది.నిజానికి ఇటువంటి సినిమా తీయడం అంటే సాహసమే అని అనాలి.
ఇక ఈ కథ ప్రేక్షకులను కనెక్ట్ చేయడంలో కొంత వరకు సక్సెస్ అయ్యింది.ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి.కానీ నటీనటుల ప్రభావం ప్రేక్షకులకుపై ఇంకాస్త కనెక్ట్ అయితే బాగుండేది.
ప్లస్ పాయింట్స్:
కథనం, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సన్నివేశాలు, కొన్ని ఎమోషన్స్ సీన్స్.
మైనస్ పాయింట్స్
: అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బోరింగ్ గా అనిపించాయి.నటీనటులు నటన పట్ల కాస్త శ్రద్ధ పెడితే బాగుండేది.
బాటమ్ లైన్: చివరిగా చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమా ఒక దేశభక్తి నేపథ్యంలో వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.
రేటింగ్: 3/5