బ్రేక్ ఈవెన్ మార్కు కి అతి చేరువలో 'భగవంత్ కేసరి'..9 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయంటే!

ఈ దసరా కానుకగా నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) హీరో గా నటించిన భగవంత్ కేసరి( Bhagwant Kesari ) చిత్రం విడుదలై మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.

సినిమా విడుదల రోజు వచ్చిన ఓపెనింగ్స్ ని చూసి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం అని అందరూ అనుకున్నారు.

కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ చిత్రం లాంగ్ రన్ లో మంచి వసూళ్లను దక్కించుకొని సూపర్ హిట్ వైపు దూసుకుపోతుంది.కుటుంబ నేపథ్యం ఉన్న సినిమా కావడం , దానికి తోడు చిత్రం లో ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా పండడం వల్ల కమర్షియల్ గా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయి.

బాలయ్య ఇమేజి కి తోడు ఫ్యామిలీ ఆడియన్స్ లో అనిల్ రావిపూడి కి ఉన్న ఇమేజి కూడా ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది.

ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ( Pre-release theatrical business )దాదాపుగా 67 కోట్ల రూపాయలకు జరిగింది.ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం 9 రోజుల్లో దాదాపుగా 58 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను సాధించింది.అంటే దాదాపుగా 90 శాతం రికవరీ అన్నమాట.

Advertisement

సాధారణంగా దసరా ( Dussehra )పూర్తైన తర్వాత సినిమాలు చాలా డల్ గా ఉంటాయని అందరూ అంటూ ఉంటారు.కానీ భగవంత్ కేసరి మాత్రం డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ సంచలనం సృష్టించింది.

మొదటి రోజు నుండి ఇప్పటి వరకు ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్ స్టాప్ గా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.ఇది ఈ ఏడాది నాన్ స్టాప్ గా వారం రోజులకు పైగా షేర్ వసూళ్లు సాధించిన రెండు మూడు చిత్రాలలో ఒకటిగా నిల్చింది.

ఈ స్థాయి వసూళ్లు నిర్మాతలు కూడా ఊహించలేదు.

ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడానికి కేవలం 10 కోట్ల రూపాయిల దూరం మాత్రమే ఉంది.ఈ వీకెండ్ లో కనీసం మూడు కోట్ల రూపాయిలు అయినా రికవర్ చేస్తుందని, వచ్చే వారం లో నూటికి నూరు శాతం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఈ చిత్రం తో బాలయ్య చాలా కాలం తర్వాత హ్యాట్రిక్ హిట్ ని అందుకున్నాడు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

ఈ సినిమా తర్వాత ఆయన వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.ఈ చిత్రం తో ఆయన తన విజయయాత్ర ని కొనసాగిస్తాడా లేదా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు