బీఆర్ఎస్ పార్టీలో బీసీగా చాలా వివక్ష చూశానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.బడుగులకు అధికారం రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని తెలిపారు.
దళితులను కేసీఆర్ మోసం చేశారని ఈటల రాజేందర్ మండిపడ్డారు.బీసీలు అంటే కేసీఆర్ కు చిన్నచూపు, చులకన అని ఆరోపించారు.
దేశానికి బీసీని ప్రధానిని చేసింది బీజేపీ అని తెలిపారు.దళిత, మైనారిటీ, గిరిజన బిడ్డలను రాష్ట్రపతిని చేసింది బీజేపీ మాత్రమేనని పేర్కొన్నారు.
కాంగ్రెస్ కూడా బీసీలను పట్టించుకోలేదని విమర్శించిన ఈటల వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.