నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకే ”భగవంత్ కేసరి” అనే టైటిల్ ను బాలయ్య బాబు బర్త్ డే కానుకగా అనౌన్స్ చేసారు.
అలాగే బర్త్ డే కానుకగా భగవంత్ కేసరి ( Bhagavanth Kesari )టీజర్ కూడా అనిల్ రావిపూడి రిలీజ్ చేయడంతో మాసివ్ రెస్పాన్స్ అందుకుంది.ఈ టీజర్ చూసిన తర్వాత మరో హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

అఖండ, వీరసింహారెడ్డి( Akhanda ) వంటి రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుండి అదిరిపోయే సమాచారం బయటకు వచ్చింది.ఈ సినిమా ఓటిటీ హక్కుల గురించి ఒక అప్డేట్ వినిపిస్తుంది.

ఓటిటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ దక్కించుకున్నట్టు తెలుస్తుంది.అమెజాన్ ప్రైమ్ వీడియో భగవంత్ కేసరి ఓటిటీ హక్కులను సొంతం చేసుకుందట.దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తున్న విషయం విదితమే.
అలాగే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తుండగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.మరి ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఫాస్ట్ గా షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించి ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.
మరి అనిల్ రావిపూడి బాలయ్యకు హిట్ అందిస్తాడో లేదో వేచి చూడాలి.







