జాగ్రత్త సుమా.. కొన్ని లక్షల సంఖ్యలో భారతీయుల క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు బట్టబయలు..!

భారత దేశ వ్యాప్తంగా ఎంతోమంది డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.తాజాగా జరిగిన సంఘటన వారందరికీ వణుకు పుట్టిస్తోంది.

మొత్తం 70 లక్షల మందికి చెందిన కార్డుల వివరాలు, వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ సమాచారమంతా డార్క్ వెబ్ లో కనిపిస్తుందని ఇంటర్నెట్ సెక్యూరిటీ సిబ్బంది తెలియజేశారు.ఆ కార్డుకు సంబంధించిన వ్యక్తులు యొక్క పేర్లు, ఫోన్ నంబర్స్ అలాగే వారు ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నరన్న వివరాలు కూడా పూర్తిగా కనపడుతున్నట్లు వారు తెలియజేశారు.ఇలా కనపడుతున్న వివరాలు ఏకంగా 2 జిబి వరకు ఉందని వారు తెలియజేశారు.2010 సంవత్సరం నుండి 2019 సంవత్సరం వరకు ఎంతో మంది కార్డు వినియోగదారుల వివరాలు లీక్ అయినట్లు నిర్ధారణకు వచ్చారు.ఇలాంటి వివరాలను బ్యాంకులకు సేవలను అందించే థర్డ్ పార్టీ వారే ఈ సమాచారాన్ని లీక్ చేసి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇకపోతే డిజిటల్ మార్కెట్ లో చాలా మందికి సాధారణ సమాచారం కంటే ప్రజల యొక్క బ్యాంకు వివరాలు సంబంధించిన సమాచారాన్ని ఎక్కువ డిమాండ్ ఏర్పడటంతో ఇలా అనేక మంది థర్డ్ పార్టీ ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ ఆన్లైన్ లో ఉంచుతున్నారు.

థర్డ్ పార్టీ వ్యక్తుల ద్వారా పొందిన సమాచారాన్ని హ్యాకర్స్, అలాగే స్క్యమర్స్ కు అందించి ఉంటారని.ఈ సమాచారంలో వినియోగదారుల కార్డుల వివరాలు అలాగే వాటికి సంబంధించిన అకౌంట్ నెంబర్లు ఆ కార్డు యొక్క పాస్వర్డ్ లను పూర్తి సమాచారం అందించి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు.కాబట్టి వీలైనంత వరకు తరచూ మీ కార్డు యొక్క పాస్వర్డ్ లను మార్చుకుంటూ ఉంటే ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి పని లేదు.

Advertisement

ఎట్టిపరిస్థితిలో మీ కార్డుకు సంబంధించిన వివరాలను, అకౌంట్ కు చెందిన ఓటీపీ లను ఇవ్వకుండా ఉండటానికి ప్రయత్నించండి.

ఇజ్రాయెలీ మ్యూజియంలో పురాతన కూజాను పగలగొట్టిన బాలుడు, వారిచ్చిన ట్విస్ట్‌తో..?
Advertisement

తాజా వార్తలు