పండ్ల తోటలను ఆశించే చీడపీడలను నివారించే మెరుగైన పద్ధతులు..!

చీడపీడలు( Pests ) ఆశించిన పంటలకు మార్కెట్లో డిమాండ్ చాలా తక్కువ.పురుగు ఆశించని కాయలకే మంచి ధర వస్తుంది.

కాబట్టి పండ్ల తోటలను( Orchards ) చీడపీడల నుండి రక్షించుకోవడంలో పూర్తిగా అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది.ముందుగా కాయలపై తల్లి ఈగలు గుడ్లను పెడతాయి.

ఆ తర్వాత వీటిలో నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు కాయ లోపలికి వెళ్లి గుజ్జును తినడం వల్ల కాయ కుళ్ళిపోయి రాలిపోతుంది.ఈ రాలిపోయిన కాయలో ఉండే లార్వాలు భూమిలోకి వెళ్లి కోసస్థ దశలొకి వెళ్తాయి.

కాబట్టి పురుగు ఆశించిన, నేల రాలిన కాయలను ఎప్పటికప్పుడు ఏరివేసి నాశనం చేయాలి.కాయ పుచ్చు, ఈగ, టెంక పురుగు ఆశించిన చెట్ల మొదల చుట్టూ చెట్ల కింద భూమిని మండువేసవికాలంలో లోతుగా కలియదున్నాలి.ఈ పురుగుల ఉనికిని గుర్తించిన వెంటనే రెండు మిల్లీలీటర్ల డైమిథోమెట్( Dimethomet ) ను ఒక లీటరు నీటిలో కలిపి రెండు లేదా మూడు సార్లు పిచికారి చేయాలి.

Advertisement

ఆకు గూడు పురుగులు పండ్ల తోటలను ఆశిస్తే వెంటనే ఈ పురుగుల గూళ్లను నాశనం చేసి రెండు మిల్లీమీటర్ల రోగార్ ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.

తామర పురుగులు( Eczema mites ) పండ్ల తోటలను ఆశిస్తే వెంటనే రెండు మిల్లీలీటర్ల మెటా సిక్స్ ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.పిండి పురుగులు పండ్ల తోటలను ఆశిస్తే.చెట్టు పాదులలో లిండేన్ లేదా కార్బారిల్ పొడి లేదా ఫోరెట్ గుళికలు వేసి నీటి తడి అందించాలి.

ఇక రెండు మిల్లీలీటర్ల మెటాసిస్టాక్స్ ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.బూడిద తెగుళ్లు పంటను ఆశించినట్లయితే ఒక మి.లీ కారథేన్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.మచ్చ తెగులు పంటను ఆశించినట్లయితే 2.5 గ్రాముల ఎం.45 ను ఒక లీటరు నీటిలో కలిపి పంటకు పిచికారి చేయాలి.

వేపతో వావ్ అనిపించే బ్యూటీ బెనిఫిట్స్.. డోంట్ మిస్!
Advertisement

తాజా వార్తలు