విజయవాడ: రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.
విజయవాడలో రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.
విద్యార్థుల యూనిఫామ్‌లో త్వరలో మార్పులు వస్తాయని తెలిపారు.విద్యార్థులు హుందాగా ఉండేలా యూనిఫామ్ రూపొందిస్తామన్నారు.
ప్రతి తరగతి గదిలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దిల్లీ కంటే ఎక్కువగా విద్యారంగంలో సౌకర్యాలు అందిస్తామని చెప్పారు.
రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిషేధిస్తున్నామని.దీనిపై పాఠశాల నుంచే అవగాహన కల్పిస్తున్నామన్నారు.
విద్యార్థులకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అధ్యాపకులకు చెప్పాలని బొత్స సూచించారు.