లంగ్స్ ఇన్ఫెక్ష‌న్‌తో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ టిప్స్ మీకోస‌మే!

లంగ్స్ ఇన్ఫెక్ష‌న్‌.పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా ఎంద‌రినో వేధించే స‌మ‌స్య ఇది.

లంగ్స్‌లో ఇన్ఫెక్ష‌న్ ఏర్ప‌డ‌టం వ‌ల్ల ద‌గ్గు, చెస్ట్ పెయిన్, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు, ఊపిరితిత్తుల దిగువ భాగంలో వాపు లేదా నొప్పి, అల‌స‌ట‌, ఆయాసం, చెమ‌ట‌లు వంటి ర‌క‌ర‌కాల ల‌క్ష‌ణాలు తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తాయి.అందుకే లంగ్స్ ఇన్ఫెక్ష‌న్‌ను నివారించుకోవ‌డం కోసం ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్‌ను పాటిస్తే గ‌నుక చాలా అంటే చాలా సుల‌భంగా లంగ్స్ ఇన్ఫెక్ష‌న్‌ను త‌గ్గించుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

పుదీనా టీ.లంగ్స్‌లో ఏర్ప‌డిన ఇన్ఫెక్ష‌న్‌ను నివారించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.రోజుకు ఒక క‌ప్పు పుదీనా టీ తీసుకుంటే గ‌నుక‌.

Advertisement

అందులో ఉండే శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫెక్ష‌న్‌ను తొల‌గించ‌డ‌మే కాదు ద‌గ్గు, ఛాతిలో నొప్పి, శ్వాస స‌మ‌స్య‌లు సైతం దూరం అవుతాయి.అలాగే చిన్న అల్లం ముక్క‌ను తీసుకుని పై పొట్టును తొల‌గించి నీటిలో శుభ్రంగా క‌డ‌గాలి.

ఇప్పుడు ఈ ముక్క‌ల‌ను డైరెక్ట్‌గా న‌మిలి తినేయాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా లంగ్స్ ఇన్ఫెక్ష‌న్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మనం ల‌భిస్తుంది.

యోగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే.ప్ర‌తి రోజు యోగా చేస్తే హెల్తీగా, ఫిట్‌గా ఉంటారు.అలాగే లంగ్స్ ఇన్ఫెక్ష‌న్ స‌మ‌స్య సైతం దూరం అవుతుంది.పాలు, పాల ఉత్ప‌త్త‌ల‌ను తీసుకోవ‌డం త‌గ్గించాలి.

ఆముదంను ప్ర‌తి రోజు ఛాతీ మీద మ‌సాజ్ చేసుకోవాలి.శ‌రీరానికి స‌రిప‌డా వాట‌ర్‌ను అందించాలి.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉండే ఉల్లి, వెల్లుల్లి, ప‌సుపు, ద్రాక్ష పండ్లు, ట‌మాటా, ఆపిల్, గ్రీన్ టీ వంటి ఆహారాలు రెగ్యుల‌ర్ డైట్‌లో ఉండేలా చూసుకోవాలి, త‌ద్వారా ఇన్ఫెక్ష‌న్ త‌గ్గి లంగ్స్ ఆరోగ్య వంతంగా మార‌తాయి.

Advertisement
" autoplay>

తాజా వార్తలు