డార్క్ సర్కిల్స్.( Dark Circles ) చాలా మంది కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో ఒకటి.
డార్క్ సర్కిల్స్ ఏర్పడడానికి కారణాలు అనేకం.కంటినిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, ఫోన్ ను అధికంగా వినియోగించడం, డీహైడ్రేషన్, ధూమపానం తదితర కారణాల వల్ల కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి.
ముఖం ఎంత తెల్లగా, నున్నగా ఉన్నా డార్క్ సర్కిల్స్ కారణంగా అందవిహీనంగానే కనిపిస్తారు.ఈ క్రమంలోనే డార్క్ సర్కిల్స్ ను వదిలించుకోవడం కోసం తోచిన ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తుంటారు.

డార్క్ సర్కిల్స్ కు శాశ్వతంగా గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా.? అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే క్రీమ్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.ఈ క్రీమ్ ను రోజు నైట్ వాడితే డార్క్ సర్కిల్స్ దెబ్బకు పరార్ అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ వాసెలిన్, పావు టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసుకుని స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేయాలి.
దాదాపు ఐదు నిమిషాల పాటు కలిపితే మన క్రీమ్ సిద్ధం అవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

రోజు నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్ ను కళ్ల చుట్టూ అప్లై చేసుకుని నాలుగైదు నిమిషాల పాటు సున్నితంగా వేళ్ళతో మసాజ్ చేసుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కళ్ళను ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా కనుక ప్రతిరోజూ చేస్తే డార్క్ సర్కిల్స్ శాశ్వతంగా దూరమవుతాయి.కాబట్టి ఎవరైతే నల్లటి వలయాలతో బాధపడుతున్నారో తప్పకుండా వారు ఇప్పుడు చెప్పబోయే క్రీమ్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.







