డయాబెటిస్ తో బాధ పడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి!

ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి.

ఇక చిన్న పెద్ద అనే వయసు తేడా లేకుండా డయాబెటిస్ వస్తుంది.డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు జీవనశైలి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా సమస్యలు తలెత్తుతాయి.

డయాబెటిస్ తో బాధపడేవారు ఆహారం విషయంలో తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలను ఇక్కడ తెలుసుకుందాం.డయాబెటిస్ తో బాధపడే వారు ముఖ్యంగా బరువును అదుపులో ఉంచుకోవాలి.

ఊబకాయులు అయిన మధుమేహ వ్యాధిగ్రస్తులు అయినబరువును ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి.అధిక బరువు ఉండటం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి ప్రమాదం.

Advertisement

బరువు 20 శాతం పెరుగుతున్న కొద్దీ, మధుమేహ సమస్య అధికమవుతుంది.వారు 5 శాతం బరువు తగ్గిన కూడా మధుమేహ సమస్య తగ్గినట్లే.కఠినమైన ఆహారం సరైన వ్యాయామం చేయడంతో బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

మధుమేహులు మందకోడిగా ఉంటే అది ఇంకా పెరిగే సమస్యలు ఉంటాయి.మధుమేహంతో బాధపడే వారు చురుకుగా పని చేయడం వల్ల శరీరంలోని హార్మోన్లు కూడా తగు విషయంలో కూడా చురుకుగా పనిచేస్తాయి.

రోజు అరగంట వ్యాయామం చేయడం ద్వారా ఇన్సులిన్ యొక్క ప్రభావం మెరుగై కణజాలాలలో చక్కర స్థాయి తగ్గుతుంది.ఎర్రని మాంసం, అవయవ మాంసం, హలీం వంటి మాంసపు వంటలు తగ్గించాలి.

వీటిలో కొలెస్ట్రాల్ శాతం అధికంగా ఉంటుంది.వీటిని తీసుకోవడం ద్వారా మధుమేహ సమస్యలు తీవ్రమవుతాయి.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

మాంసాహారం తక్కువ తీసుకుంటూ, వీలైనంత ఎక్కువగా చేపలను తీసుకోవాలి.చేపలలో ఒమేగా 3, ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉండటం వల్ల డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది.

Advertisement

దాల్చిన చెక్క పొడిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మధుమేహ సమస్యను తగ్గించవచ్చు.ఇందులో ఉన్న ఔషధ గుణాలు ఇన్సులిన్ సక్రమంగా పనిచేయుటకు ఎంజైమ్ లను ప్రోత్సహిస్తుంది.

చక్కెర లేకుండా కాఫీ తాగడం వల్ల కాఫీలో ఉండే కెఫిన్, శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.ఎక్కువ మానసిక ఒత్తిడి ఆందోళనల గురవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

వీలైనంత వరకు ప్రశాంతతను కలిగి ఉండి, యోగా వంటి వాటిని చేయడం ద్వారా మానసిక ఒత్తిడి నుంచి దూరం కావచ్చు.

తాజా వార్తలు