వింట‌ర్‌లో చ‌ర్మాన్ని ర‌క్షించే బెస్ట్ ఎసెన్షియల్ ఆయిల్స్‌ ఇవే!

వింట‌ర్ సీజ‌న్ రానే వ‌చ్చింది.ఈ సీజ‌న్‌లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అంద‌రినీ ప్ర‌ధానంగా వేధించేది చ‌ర్మ స‌మ‌స్య‌లే.

వీటి నుంచి త‌ప్పుకునేందుకు మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే క్రీములు, లోష‌న్లు, మాయిశ్చ‌రైజ‌ర్లు.ఇలా ఎన్నో వాడుతుంటారు.

అయితే వింట‌ర్ సీజ‌న్‌లో చ‌ర్మాన్ని ర‌క్షించేందుకు కొన్ని కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి ఆ ఎసెన్షియల్ ఆయిల్స్ ఏంటీ.? వాటిని చ‌ర్మానికి ఏ విధంగా ఉప‌యోగించాలి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్.

చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తాయి.ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల కొబ్బ‌రి నూనెలో, రెండు చుక్క‌లు జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు, చేతుల‌కు అప్లై చేసుకుని కాసేపు మ‌సాజ్ చేసుకోవాలి.బాగా ఆరిన త‌ర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్ర ప‌రుచుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే పొడి చ‌ర్మం మృదువుగా, తేమ‌గా మారుతుంది.మ‌రియు న‌ల్ల మ‌చ్చ‌లు ఏవైనా ఉంటే త‌గ్గుతాయి.

అలాగే వింట‌ర్ సీజ‌న్‌లో చ‌ర్మం రంగు త‌గ్గి పోతుంటుంది.అయితే స్కిన్ టోన్‌ను పెంచ‌డంలో రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.ఒక బౌల్ తీసుకుని అందులో ఆరు స్పూన్ల ఆల్మండ్ ఆయిల్‌, నాలుగు చుక్క‌లు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని క‌లుపుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి అప్లై చేసి.డ్రై అయిన త‌ర్వాత స్నానం చేయాలి.ఇలా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ఇక ఈ సీజ‌న్‌లో చాలా మంది ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో ముడ‌త‌లు ఒక‌టి.అయితే ముడ‌త‌ల‌ను త‌గ్గించ‌డంలో శాండిల్‌వుడ్ ఎసెన్షియల్ ఆయిల్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement

ఒక చిన్న గిన్నెలో రెండు స్పూన్లు ఆలివ్ ఆయిల్‌, రెండు చుక్క‌లు శాండిల్‌వుడ్ ఎసెన్షియ‌ల్ ఆయిల్ తీసుకుని మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి పూసి కాసేపు మ‌సాజ్ చేసుకుని.

ఆపై వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజూ చేస్తే ముడ‌త‌లు త‌గ్గ‌డ‌మే కాదు.

వృద్ధాప్య ఛాయ‌లు వ‌చ్చే రిస్క్ త‌గ్గు ముఖం ప‌డుతుంది.

తాజా వార్తలు