వీరయ్యకు ఇది బెస్ట్ ఛాన్స్.. సంక్రాంతి బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపిస్తాడా?

ఇటీవల కాలంలో ప్రేక్షకులు చెప్పే తీర్పు అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది.ఎంత పెద్ద హీరో అయినప్పటికీ ప్రేక్షకులు ఎలాంటి మొహమాటం లేకుండా కంటెంట్ ఉంటేనే సినిమాలను ఆదరిస్తున్నారు.

 Best Chance For Chiranjeevi Waltair Veerayya Details, Ajith Kumar, Balakrishna,-TeluguStop.com

ఇక సంక్రాంతి పండుగ కానుకగా ఎప్పటి లాగానే ఈసారి కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ నెలకొంది.ఈసారి స్టార్ హీరోల సినిమాల మధ్య గట్టి పోటీ ఉండనుంది.

ఇలా ఒకేసారి సినిమాలు వస్తే ఒక సినిమా హిట్ అయితే మరో సినిమాపై ప్రభావం పడడం సహజమే.అయితే రెండు సినిమాలకు టాక్ వస్తే కాస్త సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టే.

ఏ మాత్రం అటు ఇటు అయినా మిగతా సినిమాలన్నీ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.ఇప్పుడు 2023 సంక్రాంతి కానుకగా మొత్తం నాలుగు సినిమాలు బరిలోకి దిగాయి.ఇప్పటికే వాటిలో మూడు సినిమాలు రిలీజ్ కాగా మరో సినిమా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

Telugu Ajith Kumar, Balakrishna, Chiranjeevi, Kollywood, Sankranti, Thunivu, Var

ఈ మూడు సినిమాల్లో విజయ్ వారిసు జనవరి 11న రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా తెలుగులో తప్ప మిగతా అన్ని భాషల్లో రిలీజ్ అయ్యింది.తెలుగులో జనవరి 14న రిలీజ్ కానుంది.

ఇక మరో తమిళ్ హీరో అజిత్ తునివు సినిమా కూడా నిన్ననే రిలీజ్ అయ్యింది.తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ అయ్యి బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

Telugu Ajith Kumar, Balakrishna, Chiranjeevi, Kollywood, Sankranti, Thunivu, Var

ఇక మన తెలుగు సినిమా బాలయ్య నటించిన వీరసింహారెడ్డి కూడా ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ప్రెజెంట్ ఈ సినిమా మిక్సెడ్ టాక్ అయితే వచ్చింది.రేపటి నుండి ఈ సినిమా పూర్తి స్థాయిలో తెలుస్తుంది.మరి రిలీజ్ అయినా మూడు సినిమాలు కూడా యావరేజ్, బిలో యావరేజ్ గానే మిగిలాయి.ఇక మెగాస్టార్ వాల్తేరు వీరయ్య మాత్రమే ఇంకా రిలీజ్ కాలేదు.రేపు ఈ సినిమా రిలీజ్ కానుంది.

మరి ఈయనకు ఇది బెస్ట్ ఛాన్స్ అనే చెప్పాలి.ఈ మూడు సినిమాల కంటే బెటర్ టాక్ తెచ్చుకుంటే సంక్రాంతి విన్నర్ అయ్యే ఛాన్సులు చాలా ఉన్నాయి.

చూడాలి ఏం జరుగుతుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube