రూ.10 వేలలోపు ఫోన్ కొంటున్నారా.. ఈ బెస్ట్ ఫోన్లపై ఓ లుక్కేయండి..

రూ.10 వేల లోపు ఫోన్లు జేబుకు చిల్లు పడకుండా అన్ని ప్రాథమిక అవసరాలను తీరుస్తుంటాయి.స్టాక్ ఆండ్రాయిడ్ UI, లాంగ్ టైమ్ బ్యాటరీ, మంచి డిస్‌ప్లే క్వాలిటీ, మెరుగైన పర్ఫామెన్స్ వంటి అనేక రకాల ఫీచర్లను అందిస్తాయి.ఎక్కువ ఖర్చు పెట్టలేని వారికి మార్కెట్లో పదివేల లోపు చాలానే ఫోన్లు( Mobile Phones ) అందుబాటులో ఉన్నాయి.వాటిలో టాప్-5 ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 Best Budget-friendly Phones Under 10k  Available In Market Details, Feature Phon-TeluguStop.com

1.Nokia C32:

రూ.8,999 ధరతో, ఇది 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్‌ను అందిస్తుంది.ఈ మొబైల్ స్టాక్ ఆండ్రాయిడ్‌లో నడుస్తుంది.నీరు, ధూళి నిరోధకత కోసం IP52 రేటింగ్‌ను కలిగి ఉంది.దీని బ్యాటరీ లైఫ్ 3 రోజుల వరకు ఉంటుంది.

Telugu Budget Friendly, Lava Blaze, Motorola, Nokia, Redmi, Samsung Galaxy, Andr

2.Redmi A2:

బడ్జెట్- ఫ్రెండ్లీ రెడ్‌మీ ఏ2( Redmi A2 ) ధర రూ.6,299 మాత్రమే ఉంది.ఇది 6.52-అంగుళాల HD+ డిస్‌ప్లే, హీలియో G36 ఆక్టా-కోర్ ప్రాసెసర్, రెండు రోజుల వరకు ఉండే పెద్ద 5,000 mAh బ్యాటరీని ఆఫర్ చేస్తుంది.మొదటిసారి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వారికి ఇది గొప్ప ఎంపిక.

Telugu Budget Friendly, Lava Blaze, Motorola, Nokia, Redmi, Samsung Galaxy, Andr

3.Samsung Galaxy M04:

శామ్‌సంగ్ గెలాక్సీ ఎమ్04( Samsung Galaxy M04 ) ధర రూ.8,499 కాగా ఈ ఫోన్ HD+ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల డిస్‌ప్లేను అందిస్తుంది.ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీని ఆఫర్ చేస్తుంది.1080p వరకు ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేయడానికి డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

Telugu Budget Friendly, Lava Blaze, Motorola, Nokia, Redmi, Samsung Galaxy, Andr

4.Motorola E13:

Motorola E13 రూ.10,000లోపు మరొక ఎంపిక.ఇది బ్లోట్‌వేర్-ఫ్రీ ఓఎస్‌తో లాంచ్‌ అయింది. 6.5-అంగుళాల డిస్‌ప్లేతో కూడిన స్టాక్ ఆండ్రాయిడ్ UIని కలిగి ఉంది.ఫోన్ 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

Telugu Budget Friendly, Lava Blaze, Motorola, Nokia, Redmi, Samsung Galaxy, Andr

5.లావా బ్లేజ్ 2:

దేశీయ బ్రాండ్ నుంచి లావా బ్లేజ్ 2 రూ.10,000లోపు దొరుకుతోంది.ఇది Unisoc T616 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది.ఫోన్ 6.5-అంగుళాల HD+ 90Hz డిస్‌ప్లే, 18W వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube