ఇడ్లీ పూరి కాదు.. బ్రేక్ ఫాస్ట్ లో ఇది తిన్నారంటే దెబ్బకు సన్నబడతారు!

మనలో చాలామంది బరువు తగ్గాలని.సన్నగా మారాలని.

తెగ ఆరాటపడుతూ ఉంటారు.

డైట్ పాటించాలని అనుకుంటారు.

డైట్ లో భాగంగా మధ్యాహ్నం లంచ్ లో రైస్ ను, నైట్ డిన్నర్ లో రోటీని తీసుకుంటారు.మరి మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ సంగతి ఏంటి.? ఇడ్లీ, దోశ, పూరీతో కానిచ్చేస్తున్నారా.? అయితే మీరు చాలా పొరపాటు చేస్తున్నారు.డేలో బ్రేక్ ఫాస్ట్ అనేది మన ఫస్ట్ మీల్.

ఫస్ట్ మీట్‌ మన రోజు మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లో హెల్దీ ఫుడ్ ను తీసుకోవడం ఎంతో ముఖ్యం.

Advertisement
Best Breakfast Recipe For Weight Loss! Weight Loss, Weight Loss Tips, Health, Go

ఇడ్లీ, పూరీ వడ వంటివి కాకుండా ఇప్పుడు చెప్పబోయే డిష్ ను తిన్నారంటే మీరు దెబ్బకు సన్నబడతారు.అలాగే మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ను కూడా పొందుతారు.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు చియా సీడ్స్( Chia seeds ), మూడు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్( Rolled oats ), వన్ టేబుల్ స్పూన్ తేనె( honey ) మరియు ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకుని బాగా కలిపి మూత పెట్టి ఫ్రిడ్జ్ లో నైట్ అంతా పెట్టుకోవాలి.ఉదయాన్నే ఒక యాపిల్ ను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే ఐదారు నైట్ అంతా నాన‌బెట్టుకున్న బాదం ప‌ప్పుల‌ను తొక్క తొల‌గించి ముక్క‌లుగా క‌ట్ చేయాలి.

Best Breakfast Recipe For Weight Loss Weight Loss, Weight Loss Tips, Health, Go

ఇప్పుడు నైట్ అంతా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ఓట్స్ బౌల్( Bowl of Oats ) ను తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, బాదం ముక్క‌లు ( Apple slices, almond slices )కలిపి తినేయడమే.బరువు తగ్గాల‌ని భావిస్తున్న వారికి ఈ ఓవర్ నైట్ ఓట్స్ రెసిపీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.బ్రేక్ ఫాస్ట్ లో ఈ రెసిపీని తీసుకుంటే ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.

దారుణం.. మురికి కాలువ నీటితో కూరగాయలు కడుగుతున్న వ్యాపారి... వీడియో చూస్తే గుండెలు గుభేల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025

ఆకలి కోరికలు తగ్గుతాయి.మెటబాలిజం రేటు పెరుగుతుంది.

Advertisement

దీంతో కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.

అంతేకాదు ఈ ఓవర్ నైట్ ఓట్స్ కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.అలాగే ఎముకలను దృఢ‌ప‌ర‌చ‌డానికి, కండరాల నిర్మాణానికి, మెదడు చురుగ్గా మారడానికి మరియు మధుమేహం వచ్చే రిస్క్ ను తగ్గించడానికి కూడా ఈ ఓవర్ నైట్ ఓట్స్ రెసిపీ తోడ్పడుతుంది.

కాబట్టి ఈ హెల్తీ డిష్ ను బ్రేక్ ఫాస్ట్ లో తప్పకుండా చేర్చుకోండి.

తాజా వార్తలు