నెల‌కు 2 సార్లు ఈ హెయిర్ మాస్క్ వేసుకుంటే జుట్టు రాల‌నే రాల‌దు!

హెయిర్ ఫాల్‌.అంద‌రినీ వేధించే కామ‌న్ స‌మ‌స్యే ఇది.

అయితే ఒక్కొక్క‌రిలో ఒక్కో కార‌ణం చేత జుట్టు రాలిపోతూ ఉంటుంది.

కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ.

ఇప్పుడు చెప్ప‌బోయే హెయిర్ మాస్క్ ను నెల‌కు రెండంటే రెండు సార్లు వేసుకున్నారంటే.జుట్టు రాల‌మ‌న్నా రాల‌దు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ హెయిర్ మాస్క్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.ముందుగా బాగా పండిన ఒక ట‌మోటోను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి ముక్కలుగా క‌ట్ చేసుకోవాలి.

అలాగే కీర దోస‌ను కూడా తీసుకుని ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్‌లో కీర దోస ముక్క‌లు, ట‌మోటో ముక్క‌లు వేసి మెత్త‌గా పేస్ట్ చేసి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

Advertisement

ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని వాట‌ర్ పోయాలి.వాట‌ర్ బాగా వేడెక్కాక అందులో మ‌రో గిన్నె పెట్టుకుని.మొద‌ట త‌యారు చేసి పెట్టుకున్న ట‌మోటో, కీరా జ్యూస్‌ను పోయాలి.

ఏడు లేదా ఎనిమిది నిమిషాల పాటు ఈ జ్యూస్‌ను వేడి చేసుకుని స్ట‌వ్ ఆఫ్ చేయాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, ట‌మాటో-కీర జ్యూస్‌, వ‌న్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే హెయిర్ మాస్క్ సిద్ధ‌మైన‌ట్టే.

ఈ హెయిర్ మాస్క్‌ను జుట్టు మొద‌ళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.గంట అనంత‌రం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.నెల‌కు రెండు సార్లు ఇలా చేస్తే గ‌నుక‌.

జుట్టు రాల‌డం క్ర‌మంగా త‌గ్గు ముఖం ప‌డుతుంది.అదే స‌మ‌యంలో జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా కూడా పెరుగుతుంది.

Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn
Advertisement

తాజా వార్తలు