విరాట్ కోహ్లీపై కేసు నమోదు బెంగళూరు పోలీసులు..

విరాట్ కోహ్లీ( Virat Kohli ).ఈ పేరు గురించి ప్రపంచంలో ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.

క్రికెట్ గ్రౌండ్ లో పరుగుల మిషన్ కు మారుపేరుగా ఈ పేరు నిలుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ఫార్మేట్ ఏదైనా సరే పరుగుల వరద సృష్టించడం అతడికి అలవాటే.

ఈయనకు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.తాజాగా టి20 2024 వరల్డ్ కప్( T20 2024 World Cup ) విజేతగా నిలిచిన టీమ్ ఇండియా తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు.

దీంతో యావత్ ప్రపంచ విరాట్ కోహ్లీ అభిమానులు నిరాశకు గురయ్యారు.ఇకపోతే ప్రస్తుతం విరాట్ కోహ్లీ తన కుటుంబంతో ఇంగ్లాండులో గడుపుతున్నాడు.

Advertisement

తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పై పోలీస్ కేస్ నమోదయింది.బెంగళూరు ( Bengaluru )మహానగరంలో ఉన్న విరాట్ కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ పబ్ లో నిబంధనలను అతిక్రమించినందుకు గాను ఈ కేసు నమోదు చేసినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు.రూల్స్ ప్రకారం.

కొద్ది సమయం వరకు పబ్ లు నిర్వహించాల్సి ఉండగా అంతకుమించి పబ్బులను నడిపినట్లుగా సమాచారం.సోమవారం రాత్రి 1:30 వరకు పబ్ ను నడిపారని.అందుకుగాను.

, వన్ 8 కమ్యూన్ పబ్ తో( One8 Commune )పాటు నగరంలోని మరో నాలుగు పబ్ ల పైన కూడా ఈ కేసులు నమోదయాయని బెంగళూరు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

మహానగరంలో పబ్బు లు రాత్రి ఒంటిగంట వరకు తెరిచి ఉండేందుకు అనుమతి ఉండగా.ఆపై కూడా తెరిచి ఉండడంతో నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ కేసులు నమోదు చేశారు.అంతేకాకుండా విరాట్ కోహ్లీకి చెందిన పబ్ లో మ్యూజిక్ ను ఎక్కువ సౌండ్ తో ప్లే చేస్తున్నారన్న ఫిర్యాదులు కూడా ఇదివరకు అందాయని బెంగళూరు పోలీసులు తెలిపారు.

అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన తెలుగు వ్యక్తి.. దాన్ని కాపాడుకోలేకపోయారు..??
అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన తెలుగు వ్యక్తి.. దాన్ని కాపాడుకోలేకపోయారు..??

చూడాలి మరి ఈ కేసు ఎంతవరకు ముందుకు వెళుతుందొ.

Advertisement

తాజా వార్తలు