ఇండియాలో బస్సుల కంటే ఆటోలే( Auto ) ఎక్కువగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.వీటిలో ప్రయాణాలు చేయడం బస్సులతో పోల్చుకుంటే కాస్త ఖరీదైనదే.
అయినా ఆటోలు ఎప్పుడంటే అప్పుడు ఈజీగా దొరుకుతాయి.ఇంటి ముందుకొచ్చి కావలసిన డిస్టెన్షన్‌కు తీసుకెళ్తాయి.
ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఆటోలను డ్రైవర్లు తీర్చిదిద్దుతారు కూడా.అంతేకాదు వాటిపై ఆకట్టుకునే కొటేషన్లు రాస్తారు.
అయితే తాజాగా బెంగళూరుకు( Bangalore ) చెందిన ఒక వ్యక్తి మాత్రం ఆటోపై ఒక ప్రొడక్ట్ రివ్యూని రాసేశాడు.
అతడి ఆటోకు చెందిన ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆటో వెనుక ఈ డ్రైవర్( Auto Driver ) రాసిన రివ్యూ చూసి జనం రియాక్ట్ అవుతున్నారు.ఇంతకీ ఆటో వెనుక అతడు ఏం రాసాడు అంటే, “ఇదొక వరస్ట్ వెహికల్, అస్సలు కొనుగోలు చేయకండి.” అని ఇతరులను హెచ్చరించాడు.ఆ ఆటో రివ్యూను ఇంగ్లీష్, కన్నడ రెండు భాషలలో పేర్కొన్నాడు.

దానికి సంబంధించి ఒక ఫొటో ఎక్స్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు.దాన్ని పోస్ట్ చేసిన వ్యక్తి బ్యాడ్ ప్రోడక్ట్( Bad Product ) గురించి ఇతరులకు చెప్పడానికి ఇది తెలివైన మార్గం అని డ్రైవర్‌ను ప్రశంసించాడు.బెంగళూరులో మాత్రమే ఇలాంటివి కనిపిస్తాయని మరికొందరు అన్నారు.ఈ ఫొటో ఎక్స్‌లో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
దీనికి 50 వేల దాక వ్యూస్ వచ్చాయి.దాదాపు 1,000 మంది వ్యక్తులు దీన్ని లైక్ చేసారు.
చాలా మంది ఈ ఫోటోపై కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాలను కూడా పంచుకున్నారు.

ఆటో పట్ల డ్రైవర్ చాలా అసంతృప్తిగా ఉన్నాడేమో, బాగా ఎవరు బాధపడకూడదు అని ఇలా రాసి ఉంటాడు అని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డాడు.ఇది మంచి ఆలోచన అని మరొకరు చెప్పారు.ఇది సమాజానికి సహాయపడే మార్గం అని ఇంకొకటి వ్యక్తి అన్నాడు.







