ఇటీవల కాలంలో ఇంటికొకరైన మధుమేహంతో బాధపడుతున్న వారు ఉంటున్నారు.మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి.
ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం దానితో సావాసం చేయాల్సిందే.అయితే మధుమేహం బాధితులకు కొన్ని కొన్ని ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి.
అందులో మెంతికూర( Fenugreek ) కూడా ఒకటి.మధుమేహులకు మెంతికూర దివ్య ఔషధం అనడంలో సందేహం లేదు.
రోజుకు గుప్పెడు మెంతికూర తీసుకుంటే ఊహించని ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.మెంతికూర లో ఐరన్ పుష్కలంగా నిండి ఉంటుంది.
అలాగే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, విటమిన్ సి, విటమిన్ బి, ప్రోటీన్, ఫైబర్.ఇలా అనేక విలువైన పోషకాలు మెంతికూర ద్వారా పొందవచ్చు.
అందుకే ప్రతిరోజు గుప్పెడు మెంతుకూరను తీసుకోవాలని ఆరోగ్యాన్ని నిపుణులు చెబుతున్నారు.పరోటా, పప్పు, స్మూతీ.
ఇలా ఏదో ఒక దానితో మెంతికూర కలిపి తీసుకోవాలి.

ముఖ్యంగా మధుమేహం( Diabetes ) ఉన్న వారు నిత్యం మెంతుకూరను తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ లో హెచ్చుతగ్గులు ఏర్పడకుండా ఉంటాయి.మధుమేహం మీ కంట్రోల్ లో ఉంటుంది.అలాగే నిత్యం మెంతికూరను తీసుకోవడం వల్ల కాలేయం శుభ్రంగా ఆరోగ్యంగా మారుతుంది.
రక్తహీనత పరార్ అవుతుంది.మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు రోజు మెంతికూరను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎందుకంటే, మెంతికూరలో ఉండే కాల్షియం ఎముకల బలహీనతను నివారిస్తుంది.బోన్స్ ను స్ట్రాంగ్ గా మారుస్తుంది.మోకాళ్ళ నొప్పులకు చెక్ పెడుతుంది.అంతేకాదు, మెంతికూరను నిత్యం తినడం వల్ల జుట్టు రాలడం( Hair loss ) తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.కడుపులో అల్సర్, పేగు మంట సమస్యలు దూరం అవుతాయి.డెలివరీ అనంతరం రోజూ మెంతికూర తీసుకుంటే తల్లిపాలు ఉత్పత్తి రెట్టింపు అవుతుంది.
మరియు గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది.కాబట్టి ఇన్ని ప్రయోజనాలను అందించే మెంతికూరను తప్పకుండా మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.







