పాదాల‌ను తెల్ల‌గా మెరిపించే క్యాబేజీ ..ఎలా వాడాలంటే?

క్యాబేజీ .ఆరోగ్యానికి ఎంత‌గానో మేలు చేసే ఆకుకూర‌ల్లో ఇది ఒక‌టి.

వివిధ ర‌కాల పోష‌కాల‌ను క‌లిగి ఉండే క్యాబేజీ  ఆరోగ్యాన్ని పెంచ‌డంలోనే కాదు అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలోనూ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.అలాగే చ‌ర్మ సౌంద‌ర్యానికి క్యాబేజీ  ఉప‌యోగ‌ప‌డుతుంది.

ముఖ్యంగా పాదాలను తెల్ల‌గా, మృదువుగా మెరిపించ‌డంలో క్యాబేజీ  సూప‌ర్‌గా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి ఇంకెందుకు లేటు క్యాబేజీ ని  పాదాల‌కు ఎలా ఉప‌యోగించాలో చూసేయండి.

ముందుగా కొన్ని క్యాబేజీ ఆకుల‌ను నీటిలో క‌డిగి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు స్పూన్ల క్యాబేజీ పేస్ట్‌, రెండు స్పూన్ల పంచ‌దార‌, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ బాదం ఆయిల్‌ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌కు ప‌ట్టించి స్మూత్‌గా ఐదారు నిమిషాల పాటు స్క్ర‌బ్ చేసుకోవాలి.ఆపై గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకుని మాయిశ్చ‌రైజ‌ర్ అప్లై చేసుకోవాలి.

ఇలా మూడు రోజుల‌కు ఒక సారి చేస్తే పాదాల‌పై పేరుకుపోయిన మురికి, మృత‌క‌ణాలు పోయి.తెల్ల‌గా, కోమ‌లంగా మార‌తాయి.

అలాగే కొన్ని క్యాబేజీ ఆకుల‌ను తీసుకుని మెత్త‌గా నూరి ర‌సం తీసుకోవాలి.ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో మూడు స్పూన్ల క్యాబేజీ ర‌సం, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ బంగాళ‌దుంప ర‌సం, రెండు స్పూన్ల బియ్యం పిండి, చిటికెడు ప‌సుపు వేసుకుని బాగా క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌కు అప్లై చేస్తూ  డ్రై అవ్వ‌నివ్వాలి.

ఆపై మెల్ల మెల్లగా రుద్దుకుంటూ పాదాల‌ను శుభ్రంగా చేసుకోవాలి.ఇలా చేసినా న‌ల్ల‌టి పాదాలు తెల్ల‌గా, అందంగా మార‌తాయి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఇక ఒక్కోసారి పాదాలు డ్రైగా మారిపోతుంటాయి.అలాంట‌ప్పుడు ఒక బౌల్‌లో రెండు స్పూన్ల క్యాబేజీ ర‌సం, రెండు స్పూన్ల కొబ్బ‌రి నూనె తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

రాత్రి నిద్రించే ముందే ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌కు అప్లై చేసి కాసేపు మ‌సాజ్ చేసుకుని ప‌డుకోవాలి.ఇలా ప్ర‌తి రోజూ చేస్తే పాదాలు పొడి బార‌కుండా ఉంటాయి.

తాజా వార్తలు