ఛత్రపతి రీమేక్ కోసం కష్టపడుతున్న బెల్లంకొండ బాబు

బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం వివి వినాయక్ దర్శకత్వంలో హిందీలో తెరంగేట్రం చేయడానికి ఛత్రపతి రీమేక్ తో రెడీ అవుతున్నాడు.

అక్కడ కూడా తనను తాను కమర్షియల్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలని ఉత్సాహపడుతున్నాడు.

దానికోసం గట్టిప్రయత్నం చేస్తున్నాడు.ఓ వైపు దర్శక, నిర్మాతలు బెల్లంకొండ శ్రీనివాస్ జోడీగా స్టార్ హీరోయిన్ ని దించాలని ప్రయత్నం చేస్తున్నారు.

ఇక హీరోయిన్ కి రెమ్యునరేషన్ గట్టిగా ఇవ్వడానికి రెడీ అవుతున్న ఎవరూ ముందుకి రావడం లేదు.సినిమాలో హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యత లేకపోవడం ఒకటైతే, ఒక కొత్త హీరోకి జోడీగా అంటే సినిమాకి బాలీవుడ్ ఆడియన్స్ నుంచి అనుకున్న స్థాయిలో బజ్ రాదని భావించి స్టార్ హీరోయిన్స్ ఎవరూ ముందుకి రావడం లేదు.

స్టార్ హీరోయిన్ కాకపోయినా సెకండ్ కేటగిరీలో ఉన్న హాట్ బ్యూటీస్ ని అయినా ఎంపిక చేయాలని వివి వినాయక్ టీమ్ వర్క్ చేస్తుంది.

Advertisement

ఇదిలా ఉంటే మరో వైపు హిందీలో డెబ్యూ మూవీతోనే తనని తాను ప్రూవ్ చేసుకోవాలని అలాగే సొంతగా డబ్బింగ్ చెప్పుకోవాలని భావిస్తున్నాడు.దానికోసం నేరుగా హిందీ క్లాసులు తీసుకుంటూ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు.దానికోసం ప్రత్యేకంగా ఒక హిందీ ట్రైనర్ ని కూడా పెట్టుకున్నాడు.

అలాగే సినిమాలో క్యారెక్టర్ ఎలివేషన్ కోసం కసరత్తులు చేస్తూ బాడీని కూడా బిల్డ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.లాక్ డౌన్, తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా సినిమా ప్రారంభానికి ముందే ఛత్రపతి నిర్మాతకి ఆరు కోట్లు నష్టం వచ్చింది.

అయినా కూడా తండ్రి వెనకున్నాడనే ధైర్యంతో బెల్లంకొండ శ్రీనివాస్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు